సినిమా అంటే పాప్‌కార్న్ తప్పనిసరి కాంబో అన్నమాట. కానీ జీఎస్టీ 1.0 లో క్యారమెల్ పాప్‌కార్న్‌పై ట్యాక్స్ పెంచేసిన వెంటనే చాలా మంది ఫ్యాన్స్‌కి టేస్ట్ మిస్ అయిపోయింది. చాలామందికి మెట్రో మాల్స్‌లో కాఫీలా, ఈ స్నాక్ కూడా మస్ట్ అయిపోయింది. కానీ అసలు సమస్య దీనిపై ఎంత పన్ను వేయాలి? 5%, 12%, ఇంకోసారి 18%... ఇలా ఒక సంవత్సరం పాటు వినియోగదారులూ, వ్యాపారులూ కన్ఫ్యూజన్‌లో పడ్డారు.

ఇప్పుడు మాత్రం బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ 'పాప్‌కార్న్ పజిల్'కి పక్కా క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై రూల్ చాలా సింపుల్. మీరు తింటున్న పాప్‌కార్న్ ఉప్పు లేదా మసాలా కలిపినదైతే (అది లూజ్‌గానీ, ప్యాకెట్‌లో గానీ ఉన్నా) కేవలం 5% జీఎస్టీ మాత్రమే చెల్లించాలి.
కానీ పాప్‌కార్న్‌లో చక్కెర వేసి క్యారమెల్ స్టైల్లో చేస్తే, అది కాంఫెక్షనరీ కేటగిరీలోకి వెళ్తుంది కాబట్టి 18% జీఎస్టీ పడుతుంది. అంటే ఫార్ములా క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. "చక్కెర ఉంటే 18%, లేకుంటే 5%." ఇక సినిమా థియేటర్‌లోనో, మాల్‌లోనో పాప్‌కార్న్ కొనేటప్పుడు మీ బిల్లు చూసి ఈ లెక్క సులభంగా అర్థం చేసుకోవచ్చు.
క్రీమ్ బన్స్‌కీ సర్ప్రైజ్: ముందు క్రీమ్ బన్స్‌ను పేస్ట్రీ కేటగిరీలో వేసి 18% పన్ను వసూలు చేసేవారు. ఇప్పుడు మాత్రం అది కూడా 5% స్లాబ్‌లోకి వస్తోంది. అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో తినే స్నాక్స్ కూడా కొంత చవక అవుతాయి.
ఇప్పటి వరకు ఉన్న నాలుగు స్లాబ్స్ - 5%, 12%, 18%, 28% వదిలేసి, ఇప్పుడు రెండు మెయిన్ స్లాబ్స్ - 5% & 18% మాత్రమే ఉంచారు. దీని వల్ల వినియోగదారులకు కూడా, వ్యాపారులకు కూడా పన్ను లెక్కలు సులభం అవుతాయి.
పాప్‌కార్న్ పన్నులపై మీమ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. ఒకరు, ఎవరైనా క్లియర్‌గా చెప్పండి, క్యారమెల్ పాప్‌కార్న్ 5%, 18% లేక 40% ట్యాక్సా? మిగతా మార్కెట్ మేనేజ్ చేసుకుంటుంది అని రాశారు. మరొకరు, "క్యారమెల్, చీజ్, సాల్టెడ్ పాప్‌కార్న్ అన్నీ ఒకే రేట్ కింద పడతాయా?" అని సరదాగా ప్రశ్నించారు.
ఈసారి జీఎస్టీ కట్ వల్ల కేవలం పాప్‌కార్న్ మాత్రమే కాదు, చాలా అవసరమైన వస్తువులు కూడా చవక అవుతున్నాయి. UHT పాలు, పనీర్, వెన్న, చీజ్, బిస్కెట్లు, జ్యూసులు, డ్రై ఫ్రూట్స్ - 5% లేదా జీరో% లోకి వచ్చేస్తాయి.
ఇప్పటి వరకూ జిమ్‌కి వెళ్ళినా, సలూన్‌లో హెయిర్‌కట్ చేయించుకున్నా, యోగా క్లాస్‌కి వెళ్లినా లేదా బార్బర్ దగ్గర షేవ్ చేయించుకున్నా ఇవన్నీ 18% జీఎస్టీ కిందికి వచ్చేవి. అంటే మీ బిల్‌కి బాగా అదనంగా పన్ను జత అయ్యేది. కానీ తాజా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో ఇక ఆ భారమే తగ్గిపోయింది. ఇకపై ఈ సర్వీసులపై కేవలం 5% జీఎస్టీ మాత్రమే చెల్లించాలి.
దాంతో జిమ్ మెంబర్‌షిప్‌లు, యోగా ఫీజులు, సలూన్ బిల్లులు, బార్బర్ చార్జీలు ఇలా ఇవన్నీ మీ జేబుకి కొంత లైట్‌గా అనిపిస్తాయి.
మొత్తానికి ఈ జీఎస్టీ కట్ వల్ల సినిమా చూసేటప్పుడు పాప్‌కార్న్ బకెట్ ఖర్చు తగ్గుతుంది, జిమ్ మెంబర్షిప్ చవక అవుతుంది, బైక్ కొనడం కొంత సులభం అవుతుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications