Salesforce: దిగ్గజ కంపెనీల లేఆఫ్స్‌తో ప్రారంభమైన కొత్త ఏడాది అదే పంథాలో కొనసాగుతోంది. లక్షలాది మంది ఇప్పటికే కొలువులు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండగా.. మరిన్ని లేఆఫ్స్ ఇచ్చేందుకు ఆయా కంపెనీలు వెనకాడటం లేదు.
క్లౌడ్ ఆధారిత కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం సేల్స్‌ఫోర్స్ ఈసారి లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ వ్యాప్తంగా ఉన్న సుమారు 700 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మొత్తం 70 వేల మంది సిబ్బందిలో 1 శాతానికి ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

ఏడాది క్రితం కూడా ఇలాగే ఏకంగా 10 శాతం మంది ఉద్యోగులపై సేల్స్‌ఫోర్స్ వేటు వేసింది. దాదాపు 8 వేల మంది సిబ్బంది కొలువు పోగొట్టుకున్నారు. ఖర్చులను తగ్గించాలనే పెట్టుబడిదారుల ఒత్తిడికి తలొగ్గక తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. అయితే తాజా నిర్ణయం వల్ల కోతలు తక్కువే కావడంతో.. ఇది సాధారణ సర్దుబాటు కావచ్చని నివేదిక పేర్కొంది.
గతేడాది కంపెనీ పలు సవాళ్లను ఎదుర్కొంది. కరోనా విజృంభణ అనంతరం విక్రయాలు మందగించడం దాని వృద్ధిని ప్రభావితం చేసింది. ఇలియట్ మేనేజ్‌మెంట్ వంటి క్రియాశీల పెట్టుబడిదారులు సంస్థలో వాటాలను కొనుగోలు చేశారు. మార్జిన్ విస్తరణను వేగవంతం చేయాలని CEO మార్క్ బెనియోఫ్‌ను కోరారు. వీటిని నెరవేర్చడానికి ఉద్యోగాల కోతలతో పాటు రియల్ ఎస్టేట్ హోల్డింగ్‌ను తగ్గించాల్సి వచ్చింది. కాగా మరోసారి కోతలకు సిద్ధమైంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications