ఇప్పటి రోజుల్లో ఒక్క జీతం మీదే ఆధారపడటం అంటే ఎప్పుడూ సరిపోని పరుగులో ఉండటం లాంటిదే. జీతం వచ్చిందంటే బిల్లులు, లోన్స్ ఊహించని ఖర్చులు అన్నీ ఒక్కసారిగా ఎదురుచూస్తుంటాయి. చివరికి జేబులో దాచుకోవడానికి ఏమీ మిగలదు. అందుకే ఇప్పుడు చాలా మంది సైడ్ ఇన్‌కమ్ వైపు చూస్తున్నారు. స్పెషల్ బిజినెస్ ఐడియా కావాల్సిన అవసరం లేదు మీ టాలెంట్, హాబీలు, లేదా చిన్న ప్లానింగ్ ఉంటే చాలు, అదనపు ఇన్‌కమ్ రావచ్చు.

ఇక్కడ మీ కోసం 12 సూపర్ ఐడియాస్:
1. హాబీతోనే ఇన్‌కమ్
మీకు పెయింటింగ్, ఫోటోగ్రఫీ, క్రాఫ్ట్స్ లాంటివి ఇష్టమా? ఇవన్నీ కేవలం హాబీస్ కాదు ఇన్‌కమ్ కూడా. ఇన్‌స్టాగ్రామ్, మీషో, ఎట్సీ వంటి ప్లాట్‌ఫాంలలో మీ క్రియేషన్స్ అమ్మి నెలకు రూ. 3,000 - రూ. 5,000 సంపాదించవచ్చు. ఇష్టమైన పనితో డబ్బు రావడం కన్నా బెటర్ ఇంకేం ఉంటుంది?
2. మైక్రో ఇన్వెస్ట్మెంట్స్
సైడ్ ఇన్‌కమ్ అంటే ఎప్పుడూ హార్డ్ వర్క్ అవసరం అనుకోవాల్సిన పని లేదు. Groww, Upstox, Angel One లాంటి యాప్స్‌లో SIPs లేదా స్టాక్స్‌లో చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేస్తే, ఫ్యూచర్‌లో మంచి రాబడులు వస్తాయి. వెంటనే డబ్బు రాదు కానీ, క్రమం తప్పకుండా చేస్తే నెలకు రూ. 2,000 - రూ.4,000 అదనంగా వచ్చే అవకాశం ఉంది.
3. ఆన్‌లైన్ కోర్సులు
మీకు ఏదైనా ఫీల్డ్‌లో బాగా అవగాహన ఉందా?ఉదాహరణకు: మార్కెటింగ్, డిజైనింగ్, కుకింగ్ లేదా యోగా అయితే Udemy, Skillshare లేదా మీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా కోర్సులు క్రియేట్ చేసి నెలకు రూ. 5,000 - రూ.10,000 సంపాదించవచ్చు.
4. డిజిటల్ ప్రొడక్ట్స్
ఈ డిజిటల్ యుగంలో ప్రొడక్ట్స్ కేవలం ఫిజికల్ మాత్రమే కావు. Canva టెంప్లేట్స్, planners, e-books లాంటివి తయారు చేసి అమ్మితే ఒకసారి చేసిన కష్టం మళ్లీ మళ్లీ ఇన్‌కమ్ ఇస్తుంది. ఒక్క ప్రొడక్ట్ రూ. 100కి అమ్మినా, నెలలో రూ. 3,000 - రూ. 6,000 వరకూ వచ్చేస్తుంది.
5. ఫ్రీలాన్సింగ్
చిన్న ప్రాజెక్ట్స్ (డేటా ఎంట్రీ, ట్రాన్స్‌క్రిప్షన్, సోషల్ మీడియా హ్యాండ్లింగ్) ద్వారా మీరు సులభంగా రూ. 500 - రూ. 1,500 ఒక ప్రాజెక్ట్‌కు సంపాదించవచ్చు. Fiverr, Upwork, Freelancer వంటి ప్లాట్‌ఫాంలలో పని దొరకడం అంత కష్టం కాదు. కాస్త టైమ్ ఇస్తే నెలకు రూ. 4,000 - రూ. 7,000 మీ అకౌంట్‌లోకి వస్తుంది.
6. అఫిలియేట్ మార్కెటింగ్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా? అయితే ఇది మీకో బంగారు అవకాశం. Amazon, Flipkart లాంటి ప్లాట్‌ఫాంల ప్రొడక్ట్స్ షేర్ చేసి 5-10% కమిషన్ సంపాదించవచ్చు. ప్రతి నెల రూ. 3,000 - రూ. 5,000 అదనంగా రావచ్చు.
7. వర్చువల్ అసిస్టెంట్
ఇంట్లోనే కూర్చుని ఇమెయిల్స్ మేనేజ్ చేయడం, షెడ్యూల్స్ ప్లాన్ చేయడం, రిపోర్ట్స్ తయారు చేయడం వంటివి చేసి 2 క్లయింట్ల నుండి రూ. 5,000 - రూ. 7,000 సంపాదించవచ్చు. వర్క్ ఫ్రం హోమ్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్.
8. టూర్ గైడ్‌గా డబ్బు
మీ నగరం గురించి బాగా తెలుసు కదా? ఆ నాలెడ్జ్‌ని క్యాష్ చేసుకోండి. లోకల్ టూర్ గైడ్‌గా మారి ప్రతి టూర్‌కు రూ. 500 - రూ. 1,000 సంపాదించవచ్చు. వారం 2-3 టూర్స్ చేస్తే రూ. 3,000 - రూ. 6,000 వరకూ వస్తుంది. డబ్బు తోపాటు కొత్తవారిని కలిసే అవకాశం కూడా.
9. మీ వస్తువులు రెంట్‌కు ఇవ్వండి
మీ దగ్గర కెమెరా, డ్రోన్, బైక్ లేదా ఫర్నిచర్ ఉందా? వాటిని ఉపయోగించని సమయంలో రెంట్‌కు ఇవ్వండి. ఒక్కోసారి రూ. 500 - రూ. 1,000 సంపాదించవచ్చు. నెలలో 4-5 సార్లు చేస్తే రూ. 2,000 - రూ. 5,000 ఇన్‌కమ్ వచ్చేస్తుంది.
10. లోకల్ వర్క్‌షాప్‌లు
యోగా, కుకింగ్, పెయింటింగ్ లాంటి స్కిల్స్ ఉన్నవారు చిన్న వర్క్‌షాప్‌లు ఆర్గనైజ్ చేసి క్లాస్‌కి రూ. 500 - రూ. 1,000 సంపాదించవచ్చు. వారం 2-3 వర్క్‌షాప్‌లు చేస్తే నెలకు రూ. 2,000 - రూ. 5,000 సులభంగా సంపాదించవచ్చు.
11. పాడ్‌కాస్టింగ్ లేదా యూట్యూబ్
మీకు టాక్ చేయడం, ఐడియాస్ షేర్ చేయడం ఇష్టమా? అప్పుడు పాడ్‌కాస్ట్ లేదా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయండి. స్టార్ట్‌లో ఇన్‌కమ్ తక్కువగా ఉంటే, కొంత టైమ్ తర్వాత Ads, స్పాన్సర్స్, అఫిలియేట్స్ ద్వారా మంచి రాబడి వస్తుంది.
12. సోషల్ మీడియా పేజ్ మేనేజ్‌మెంట్
చిన్న బిజినెస్‌లు Instagram, Facebookలో పేజ్ మెయింటేన్ చేయడానికి టైమ్ ఇవ్వలేరు. మీరు కాంటెంట్ పోస్ట్ చేయడం, రీల్స్ క్రియేట్ చేయడం, కామెంట్స్/DMs హ్యాండిల్ చేయడం చేస్తే సులభంగా నెలకు రూ. 5,000 - రూ. 8,000 సంపాదించవచ్చు.
సైడ్ ఇన్‌కమ్ సంపాదించాలంటే మొదట మీ దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయో గుర్తించాలి. ఉదాహరణకి, మీరు రాయగలరా? అయితే సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ చేసుకోవచ్చు. డ్రాయింగ్ లేదా డిజైన్ అంటే ఇష్టం ఉంటే ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో డిజైన్ జాబ్స్ తీసుకోవచ్చు. మీకు కుకింగ్ బాగా వస్తే యూట్యూబ్ ఛానెల్ పెట్టి రెసిపీలు షేర్ చేయొచ్చు. మొదట్లో డబ్బు తక్కువగా వచ్చినా, ఓర్పు పట్టుకుని క్రమంగా కష్టపడి చేస్తే ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా, ఈ సైడ్ ఇన్‌కమ్‌ని రెగ్యులర్‌గా టైమ్ కేటాయించి చేయాలి. "వీక్‌ఎండ్‌లోనే చేస్తా" అని వదిలేస్తే ఫలితం ఉండదు. క్రమశిక్షణ, కష్టపాటు, మీ స్కిల్స్‌ని మెరుగుపరుచుకోవడం ఇవి ఉంటే సైడ్ ఇన్‌కమ్ ఒక పెద్ద సపోర్ట్‌గా మారుతుంది.
జీతం మాత్రమే ఆధారం అన్న రోజులు పోయాయి. హాబీస్, డిజిటల్ స్కిల్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా సరే, చిన్న ప్రయత్నమే పెద్ద మార్పు తెస్తుంది. క్రమం తప్పకుండా చేస్తే నెలకు అదనంగా రూ. 20,000 సంపాదించడం అంత కష్టం కాదు!
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications