ఉద్యోగులకు ఒక తీపి కబురు! గత కొంతకాలంగా వేతన పెరుగుదల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న కంపెనీలు, 2026లో తమ పద్ధతిని మార్చుకోబోతున్నాయి. భారత్‌లో వచ్చే ఏడాది జీతాల పెంపు (Salary hike) సానుకూలంగా ఉండబోతోందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మీరు కూడా కెరీర్ మార్పు లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటే.. ఈ వివరాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.

ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో.. భారతదేశంలోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు 2026లో ఊరట లభించనుంది. ఏన్ (Aon) నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 2026 లో సగటు జీతాల పెంపు (Salary hike) 9.1 శాతంగా ఉండే అవకాశం ఉంది. ఇది 2025 లో నమోదైన 8.9 శాతం కంటే మెరుగైనది. కంపెనీలు తమ వ్యాపార విస్తరణ, వ్యయ నియంత్రణ మధ్య సమతుల్యతను పాటిస్తూ, ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టిపెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి.
ఏ రంగాల్లో ఎక్కువ జీతాలు పెరుగుతాయి?
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా కొన్ని రంగాలు ఇతర రంగాల కంటే మెరుగైన వృద్ధిని కనబరచనున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అత్యధికంగా 10.2 శాతం వరకు జీతాల పెంపు ఉండవచ్చని అంచనా. వీటితో పాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) 10.1 శాతం పెంపుతో ముందంజలో ఉన్నాయి.
- మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ రంగాల్లో 9.9 శాతం వరకు పెంపు ఉండవచ్చు.
- ఇంజనీరింగ్, రిటైల్ రంగాల్లో సగటున 9.5 శాతం కంటే ఎక్కువగానే వేతన వృద్ధి కనిపిస్తోంది.
- లైఫ్ సైన్సెస్ రంగం కూడా జాతీయ సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.
ఐటీ రంగంలో పరిస్థితి ఏంటి?
టెక్నాలజీ రంగంలో పరిస్థితి మిశ్రమంగా ఉంది. ఒకప్పుడు భారీ జీతాలు ఇచ్చిన ఐటీ సర్వీసెస్ కంపెనీలు, ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. టెక్నాలజీ కన్సల్టింగ్, సర్వీసెస్ విభాగంలో జీతాల పెంపు (Salary hike) కేవలం 6.6 శాతంగానే ఉండవచ్చు. అయితే టెక్నాలజీ ప్రొడక్ట్ , ప్లాట్‌ఫారమ్ కంపెనీలు మాత్రం 9.4 శాతం వరకు పెంపు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. డిజిటల్, స్పెషలైజ్డ్ రోల్స్ ఉన్నవారికి డిమాండ్ ఇంకా బలంగానే ఉండటం దీనికి ప్రధాన కారణం.
తగ్గుతున్న ఉద్యోగుల వలసలు
గత కొన్ని ఏళ్లుగా కంపెనీలను వేధిస్తున్న ప్రధాన సమస్య 'అట్రిషన్' అంటే ఉద్యోగులు కంపెనీని వీడటం. అయితే 2025 లో ఇది 16.2 శాతానికి తగ్గింది. 2024లో 17.7 శాతంగా ఉన్న ఈ రేటు క్రమంగా పడిపోవడం, ఉద్యోగ మార్కెట్ నిలకడగా మారుతుందనడానికి సంకేతం. గ్లోబల్ అనిశ్చితి వల్ల ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న చోటే స్థిరంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. మరోవైపు కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వస్తుండటంతో.. కంపెనీలు తమ శాలరీ స్ట్రక్చర్ ను , సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ను కూడా మార్చుకుంటున్నాయి.
మొత్తానికి 2026 లో జీతాల పెంపు చాలా భారీగా లేకపోయినా.. నిలకడగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దేశీయ డిమాండ్ పెరగడం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం వల్ల కంపెనీలు తమ ఉద్యోగులకు మెరుగైన ప్యాకేజీలను అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications