భారత ఐటీ రంగం అంటే ఎప్పుడూ "హై సాలరీ, బ్రైట్ ఫ్యూచర్" అని ఊహిస్తారు. కానీ బయట పరిస్థితి వేరేలా ఉంటుంది అని ఒక టెకీ రెడ్డిట్ పోస్ట్‌లో వెల్లడించాడు. నాలుగేళ్లలో 4 లక్షల నుండి 6.5 లక్షల వరకు మాత్రమే పెరగడం? ఇది చాలా మందికి షాక్‌గా ఉంది ఎందుకంటే ఐటీ రంగంలో వేతనాలు ఎప్పుడూ రాకెట్స్ లాగా పెరుగుతాయని అందరి నమ్మకం. కాని ఇప్పటి భారత్‌లో ఐటీ ఉద్యోగాల వాస్తవ పరిస్థితులు, సలహాలు, మరియు జీతం పెంపు అనుకున్నంత లేవు.

ఆ టెకీ మాట్లాడుతూ "నాలుగేళ్ల క్రితం నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించాను. మొదటి జీతం 4 లక్షల ప్యాకేజ్. నాలుగు సంవత్సరాల తర్వాత నాకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టీమ్‌లో ప్రమోషన్ వచ్చింది. కానీ జీతం మాత్రం 6.5 లక్షలకే పరిమితమైంది" అని చెప్పారు.
అంతేకాకుండా "నేను పూర్తిగా ప్రాజెక్ట్‌లను మేనేజ్ చేయడం లేదు. చిన్న చిన్న టాస్కుల్నే చూస్తున్నాను. ఈ రోలులో గ్రోత్ పరిమితంగా ఉంది" అన్నారు. అలాగే, "పని చేస్తూనే డేటా సైన్స్, సైబర్‌సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాలను ట్రై చేశాను. కానీ కోడింగ్‌లో నాకు అంత నైపుణ్యం లేదు, అయినా నేను కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చాను. ఇప్పుడు నేను పూర్తిగా మరో ఫీల్డ్‌కి మారాలా? లేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లోనే సర్టిఫికేషన్ తీసుకుని కొనసాగాలా? నా లక్ష్యం త్వరగా, సేఫ్‌గా జీతం పెరగడం. ఇప్పుడు డైలమాలో ఉన్నాను" అని తన సమస్యను వివరించాడు.
Indeed PayMap సర్వే ప్రకారం టెక్ ఫ్రెషర్స్ నెలకు రూ.28,600 వరకూ సంపాదిస్తున్నారు. ఐదు నుంచి ఏడు సంవత్సరాల అనుభవం ఉన్నవారు నెలకు సగటు రూ. 68,900 వరకు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్, AI సంబంధిత పనుల డిమాండ్ పెరగడం వల్ల ఈ జీతాలు కాస్త పెరిగాయని రిపోర్ట్ చెబుతోంది.
ప్రొడక్ట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి రోల్స్ అత్యధిక వేతనాలు ఇచ్చే విభాగాల్లో ముందంజలో ఉన్నాయి. ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్నవారు నెలకు రూ.85,500 వరకు సంపాదిస్తున్నారని రిపోర్ట్‌లో ఉంది. అలాగే UI/UX డిజైన్ రోల్స్ కూడా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రోల్స్‌తో సమానంగా ముందుకు వస్తున్నాయి. సీనియర్ డిజైనర్లు నెలకు రూ.65,000 వరకూ సంపాదిస్తున్నారు.
రెడిట్లో ఒక యూజర్ సలహా ప్రకారం, "నేను కూడా అదే పరిస్థితిలోనే ఉన్నాను. నాకు కోడింగ్ రాదు ఎందుకంటే నేను మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. అందుకే ServiceNow నేర్చుకుంటున్నాను. దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది" అని చెప్పాడు.
మరొకరు సలహా ఇస్తూ, "నువ్వు ఉన్న నైపుణ్యాలనే బాగా నేర్చుకోని PMP సర్టిఫికేషన్ తీసుకో. ఆ తర్వాత పెద్ద బాధ్యతలతో ఉన్న కంపెనీల్లో అప్లై చెయ్యి" అన్నారు.
ఇంకొకరు సూచిస్తూ "సాలరీ జంప్ కావాలంటే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లోనే ఉండి PMP/CSM వంటి సర్టిఫికేషన్ తీసుకో. ఆ తర్వాత కంపెనీ మారు అని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ రోల్స్ మంచివే కానీ టైమ్ ఎక్కువ పడుతుంది. వెంటనే ఎక్కువ జీతం కావాలంటే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌తోనే వేగంగా సాధ్యమవుతుంది" అని తెలిపారు.
అసలు సమస్య ఏమిటి?
ఐటీ రంగం జీతాలపై ఎప్పుడూ పెద్ద అంచనాలు ఉంటాయి. కానీ అందరికీ ఒకే స్థాయిలో వృద్ధి జరగడం లేదు. కొన్ని రోల్స్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఆ ఫీల్డ్స్‌లో ఉన్నవారికి మంచి జీతాలు వస్తున్నాయి. కానీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో సర్టిఫికేషన్ లేకపోతే లేదా పెద్ద ప్రాజెక్టులు హ్యాండిల్ చేయకపోతే పెరుగుదల కావలసినంత మాత్రమే ఉంటుంది.
ఈ టెకీ ఉదాహరణతో స్పష్టమైంది ఏమిటంటే జీతం పెరగాలంటే సర్టిఫికేషన్లు, నైపుణ్యాలు మరియు సరైన సమయంలో కంపెనీ మార్పు చాలా కీలకం.
ఐటీ రంగం ఇంకా అధిక జీతాలు ఇస్తున్నప్పటికీ, అందరికీ ఒకే రీతిలో లాభం కలగడం లేదు. సీనియర్ ప్రొఫెషనల్స్, కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నవారికే అవకాశాలు ఎక్కువ. కానీ మిగతా వారికి పెరుగుదల కాస్త తక్కువే. ఈ టెకీ అనుభవం మధ్యస్థాయి ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తుంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications