ఈ టాప్ కంపెనీల్లో ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు జీతాలు కట్, ఎందుకో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా దూసుకువస్తున్న ఆర్థిక మాంద్య ప్రభావంతో కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగించడంతో పాటు నష్టాలు వస్తున్న సబ్ కార్యాలయాలను మూసివేస్తున్నాయి. అయితే తాజాగా తమ ఖర్చులతో పాటు నిధుల భారాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు మరో పనికీ శ్రీకారం చుట్టాయి. క్లయింట్లు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి.దీంతో కన్సల్టింగ్, ఆడిట్ సంస్థలపై ఈ ఎఫెక్ట్ పడింది.

ఇండియా ఇంక్ అంటే..భారతీయ కార్పొరేట్ రంగం లేదా వ్యాపార సంస్థల సమూహం క్లయింట్లు ఖర్చలను తగ్గించుకోవడం ద్వారా నిధుల భారం నుంచి బయటపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. కార్పోరేట్ రంగంలొ టాప్ సంస్థలైన KPMG, EY, PwC, డెలాయిట్‌లు తమ సిబ్బంది ప్రమోషన్లు, జీతాల పెంపు, భాగస్వాముల సంఖ్యపై భారీగా కోతలు విధించాయి. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ మార్కెట్లో ఐటీ రంగం నుంచి వచ్చే ప్రధాన కన్సల్టింగ్ క్లయింట్లు తగ్గిపోయాయి.

Big Four promotions freeze Big Four salary cuts Deloitte salary news EY promotions 2025 KPMG pay cuts PwC promotion delay client budget cuts accounting firms layoffs Big Four news 2025 corporate salary trends Big Four employees HR trends Big Four job growth audit firms EY 2025 KPMG PwC HR

టాప్ సంస్థలోని ఒక సీనియర్ అధికారి ప్రకారం.. IT రంగం వంటి ప్రధాన క్లయింట్లు మందగించడంతో ప్రమోషన్లు, ఆగస్టు/సెప్టెంబర్ నెల బోనస్‌లు ప్రభావితమవుతాయన్నారు. ప్రమోషన్ లు తగ్గడంతో పాటుగా రానున్న నెలలో కంపెనీలు ఇచ్చే ప్రయోజాలన్నీ తగ్గిపోతాయన్నారు.

గత వారం ఇండియాలో డెలాయిట్ నుంచి 4,600కి ప్రమోషన్ లభించింది. అయితే గతేదాడి దాదాపు 5,000 మందికి లభిస్తే ఈ షారి 400 తగ్గిపోయింది.తగ్గుదల దాదాపు 8శాతంగా నమోదైంది. గత సంవత్సరం 150 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా మారగా ఈ ఏడాది కేవలం 74 మంది మాత్రమే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా మారారు.ఇక మరో టాప్ కంపెనీ EYలో భాగస్వామి ప్రమోషన్ల విషయానికి వస్తే..2024లో 124 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రమోషన్లు పొందితే ఈ ఏడాది.. 110 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు మాత్రమే ప్రమోషన్లు పొందారు.

KPMG ప్రకారం.. బాహ్య మార్కెట్ శక్తులు దీనిపై ప్రభావం చూపుతున్నా, మెరిట్ ఆధారంగా అధిక పనితీరు కనబరిచినవారికి ప్రాధాన్యత ఇస్తారు.కన్సల్టింగ్, ఆడిట్ సంస్థలలో పనితీరు లా సంస్థలలో మాదిరిగానే ఉంటుంది. ఈక్విటీ భాగస్వాములు కంపెనీలో పెట్టుబడి పెడతారు. అలాగే క్లయింట్లను తీసుకువస్తారు. సంస్థ ఆదాయంలో కొంత భాగాన్ని లాభంగా పొందుతారు.ఇందులో మొత్తం 3 వేల మంది సభ్యులు ఉంటారు. గత సంవత్సరంలో ఈ భాగస్వాముల వృద్ధి రేటు 7-9%గా నమోదైంది. ఇదిలా ఉంటే 2025లో ఈ వృద్ధి రేటు 5 నుంచి 7 మధ్యలోకి రావొచ్చు. అంటే తగ్గుదల నమోదు కావొచ్చు.

ఈ ప్రభావం IT రంగం మందగమనంతో ప్రారంభమైందనే చెప్పుకోవాలి. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, TCS, HCL వంటి సంస్థల ఉద్యోగాల్లో కోతలే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక మందగమన పరిస్థితిలో వృత్తిపరమైన సేవల సంస్థలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ప్రదర్శన ఆధారంగా నియామకాలు, ప్రమోషన్లు, బోనస్‌లు అందించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ పెంపు చక్రంలో బాహ్య మార్కెట్ శక్తుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటామని భారతదేశంలోని KPMG అంగీకరించింది.

ప్రపంచ మార్కెట్లలో వృద్ధి మందగించడంతో పాటుగా నియంత్రణ ఒత్తిడి పెరుగుదల నేపథ్యంలో వృత్తిపరమైన సేవల సంస్థలు పునర్నిర్మాణం చేస్తున్నాయని ది ఎకనామిక్ టైమ్స్ ఏప్రిల్‌లో కథనం వెలువరించింది. మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ఐటీ సంస్థలలో తొలగింపులు తీవ్ర ప్రభావాన్ని చూపాయని..దీంతో ఈ ప్రభావం ఇతర రంగాలలో కూడా కనిపిస్తుంది.

దేశంలో ఐటీ సేవల రంగంలోని ఐదు పెద్ద కంపెనీలైన టాటా, ఇన్ఫోసిస్ డ్, హెచ్‌సిఎల్, విప్రో లిమిటెడ్, టెక్ మహీంద్రా కంపెనీలో ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం ఫలితంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కంపెనీలో నియామకాలు, వేతనాల పెంపుపై మిశ్రమ సంకేతాలను పంపుతున్నాయి.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+