Budget 2024 Expectations: ఈసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వేళ తొలి బడ్జెట్ జూలై 23న ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని పన్ను చెల్లింపుదారులు నిర్మలమ్మ నుంచి మదింపు బహుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80Cలో ఏమైనా మార్పులు చేస్తారనే అంచనాలు పన్ను చెల్లింపుదారుల్లో నెలకొన్నాయి. సాధారణంగా పన్ను ఆదా విషయానికి వస్తే.. పాత పన్ను విధానంలో ఉండే సెక్షన్ 80Cని ఉపయోగించి జీతం పొందే వ్యక్తులు వారు చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందవచ్చని తెలిసిందే.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద జీతం పొందే వ్యక్తులు పెట్టుబడులను పేర్కొనడం ద్వారా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. జీతం పొందే చాలా మంది వ్యక్తులు జనరల్ ప్రావిడెంట్ ఫండ్, 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌తో సహా వివిధ పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఈ పరిమితిని కేంద్రం 2014 నుంచి ఇదే స్థాయిలో కొనసాగిస్తోంది. అయితే దాదాపు దశాబ్థకాలంలో ప్రజలకు ఖర్చులు సైతం పెరిగాయి. ఇటువంటి సమయంలో సెక్షన్ 80C కింద అందిస్తున్న మదింపు పరిమితిని పెంచాలనే డిమాండ్ చాలా మంది పన్ను చెల్లింపుదారుల నుంచి బలంగా ఉంది.
పాత పన్ను విధానంలో పదేళ్లుగా కొనసాగుతున్న సెక్షన్ 80C మందిపుపై ఈసారి బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త పన్ను విధానంతో ఈ సెక్షన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం వేతనజీవులు పరిమితిని పాత పన్ను పద్ధతి కింద రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని కోరుకుంటున్నారు. అలాగే పాత పద్ధతి నుంచి కొత్త పన్ను విధానంలోకి మారే వారికి ప్రోత్సాహకాలను అందించాలని కూడా భావిస్తున్నారు.
ఇదే క్రమంలో సెక్షన్ 80D కింద బీమా ప్రీమియంల కోసం చెల్లించే మొత్తాలకు ఆదాయపు పన్ను మినహాయింపును ప్రస్తుతం ఉన్న రూ.50,000 నుంచి పెంచాలని డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. హోమ్ లోన్‌పై వడ్డీ, అసలు చెల్లించే వారికి పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని డిమాండ్ ఉంది. అదేవిధంగా వైద్య బీమా ప్రీమియంపై ఆదాయపు పన్ను మినహాయింపును వ్యక్తులకు రూ.25,000 నుంచి రూ.50,000కు, సీనియర్ సిటిజన్లకు రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ క్లిష్టతరమైన రేట్లు ఉన్నందున దానిని సరళీకృతం చేయాలని డిమాండ్ చేశారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications