న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహా భయానకంగా విజృంభిస్తోంది. ప్రాణాలను హరిస్తోంది. ఇప్పటిదాకా ఎప్పుడూ లేనివిధంగా రెండు వేలకు పైగా రోజువారీ మరణాలు నమోదవుతున్నాయి. మరోవంక- అన్ని రంగాలూ దీని ప్రభావానికి గురవుతున్నాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించడం, వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. నిర్మాణ, మౌలిక రంగాలపై ఆధారపడిన పరిశ్రమలు సెకెండ్ వేవ్ ధాటికి కుప్పకూలిపోయే దశకు చేరుకుంటున్నాయి. ప్రత్యేకించి- ఆక్సిజన్ కొరత దేశాన్ని చుట్టుముట్టింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలన్నీ ఖాళీ అయిపోతున్నాయి.

స్టీల్ ఫ్యాక్టరీల్లో ఆక్సిజన్ ఉత్పత్తి..
ప్రాణవాయువు అందకపోవడం వల్ల రోజూ పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు మృత్యువాత పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దేశ రాజధానిలోని గంగారామ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల 25 మంది పేషెంట్లు చనిపోయారంటే- దాని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి స్టీల్ ఫ్యాక్టరీలు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. టన్నుల కొద్దీ ఆక్సిజన్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

విశాఖ, సెయిల్ సహా..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఆక్సిజన్ ఉత్పత్తిని రెట్టింపు చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు 600 టన్నులకు పైగా ఆక్సిజన్ విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి సరఫరా అవుతోంది. తాజాగా- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా తమకు ఉన్న ఉక్కు తయారీ కర్మాగారాల నుంచి సగటున ప్రతి రోజూ 660 మెట్రిక్ టన్నుల మేర ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. బోకారో స్టీల్ ప్లాంట్‌లో ఈ నెల 21వ తేదీ నుంచి 891 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను సెయిల్ ఉత్పత్తి చేసింది.

క్యాప్టివ్ ఆక్సిజన్ ప్లాంట్లు..
భూమిలో లభించే హెమటైట్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్, ఐరన్ ఓర్‌ను ఇనుముగా మార్చడానికి 2000 డిగ్రీల సెల్సియస్ వద్ద బ్లాస్ట్ ఫర్నేస్‌ను మండించాల్సి ఉంటుంది. అప్పుడే అది కరుగుతుంది. ఈ ప్రక్రియలో ఇనుమును వేరు చేయడానికి ఆక్సిజన్‌ను రసాయన ప్రక్రియ కోసం బ్లాస్ట్ ఫర్నేస్‌లోకి పంపించాల్సి ఉంటుంది. హెమటైట్ నుంచి స్టీల్ వేరు కావడానికి ఆక్సిజన్ పెద్ద ఎత్తున అవసరమౌతుంది. ఇంత పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ను తయారు చేసుకోవడానికి స్టీల్ ఫ్యాక్టరీలు సొంతంగా ఆక్సిజన్ తయారీ యూనిట్‌ను నెలకొల్పుకుంటుంటాయి. క్యాప్టివ్ ఆక్సిజన్ ప్లాంట్లుగా భావిస్తారు.

ఆదుకుంటున్నవి అవే..
ఇప్పుడు ఇదే ఆక్సిజన్ దేశానికి అవసరమైంది. దీన్ని యధాతథంగా కాకుండా.. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ)గా మార్చాల్సి ఉంటుంది. దీనికోసం ఎయిర్ కంప్రెషర్ ద్వారా గాలిని తీసుకొని అందులోని మలినాలను వేరు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనుపూర్తి చేసిన తరువాత.. దాన్ని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తారు. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కోసం ప్రత్యేక ట్యాంకర్లు అవసరమౌతాయి. దీన్ని రైల్వే మంత్రిత్వ శాఖ యుద్ధ ప్రాతిపదికన తయారు చేసింది. సెయిల్.. బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి రోజూ సగటున 660 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications