బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (54) గత బుధవారం అర్థరాత్రి బాంద్రాలోని 12వ అంతస్తులోని తన ఫ్లాట్‌లోకి ప్రవేశించిన ఓ దొంగ కత్తితో పలుమార్లు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డా సంగతి మీకు తెలిసిందే. ఈ దాడి సైఫ్ మెడ, వీపు, చేతులతో సహా శరీరంలో చాలా చోట్ల గాయాలయ్యాయి. దింతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ కి అత్యవసర శస్త్రచికిత్స జరిగింది.
సైఫ్ అలీఖాన్ క్షేమంగా ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఓఓ) డాక్టర్ నీరజ్ ఉత్తమని తెలిపారు. ప్రస్తుతం ఆయన బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్ తన ట్రీట్మెంట్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో సైఫ్ అలీఖాన్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫామ్‌లో రూ.25 లక్షలు చూపిస్తుంది. సైఫ్ అలీఖాన్‌కు నివా బూప ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. సైఫ్ అలీఖాన్ తన ట్రీట్మెంట్ కోసం రూ.35.95 లక్షలు క్లెయిమ్ చేశారని, అందులో రూ.25 లక్షలకు ఇన్సూరెన్స్ కంపెనీ ఆమోదం తెలిపిందని లీకైన ఫోటోల్లో వెల్లడైంది. అయితే, ఈ రూ.25 లక్షలు ప్రారంభం మొత్తం మాత్రమే, ఇంకా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కోసం ఆమోదించబడింది. ఫైనల్ బిల్లు వచ్చిన తర్వాత మిగిలిన మొత్తం ఏదైనా ఉంటే పాలసీ నిబంధనలు ఇంకా షరతుల ప్రకారం చెల్లించబడుతుంది. ఇది కాకుండా డాక్యుమెంట్‌లలో అతని పాలసీ మెంబర్ ID, డయాగ్నోసిస్, రూమ్ టైప్, డిశ్చార్జ్ డేట్ జనవరి 21 వంటి సున్నితమైన సమాచారం ఉంది.
ఇచ్చిన సమాచారం ఆధారంగా
54 ఏళ్ల ఈ హీరో ప్రస్తుతం బాంద్రాలోని లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని సూట్ రూమ్‌లో ఉన్నారు, అక్కడ అతను 'శారీరక గాయాల' కోసం చికిత్స పొందుతున్నారు. అతను 16 జనవరి 2025న అడ్మిట్ అయ్యారు. అతని కుటుంబం మొదట రూ. 3,598,700 హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం అభ్యర్థించింది. అయితే చికిత్స కోసం కంపెనీ రూ. 2,500,000 ప్రారంభ మొత్తాన్ని మాత్రమే ఆమోదించింది.
క్లెయిమ్‌పై కంపెనీ ఏం చెప్పిందంటే ?
నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ వెరిఫై చేసింది, 'మా పాలసీదారుల్లో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. అతను ఆసుపత్రిలో చేరిన తర్వాత, క్యాష్ లెస్ ప్రీ-అథరైజేషన్ రిక్వెస్ట్ మాకు పంపించారు. మేము ఆరోగ్యం కోసం ప్రాథమిక మొత్తాన్ని ఆమోదించాము. చికిత్స పూర్తయిన తర్వాత ఫైనల్ బిల్లులు వచ్చాక పాలసీలోని నిబంధనలు ఇంకా షరతుల ప్రకారం మిగిలిన మొత్తం సెటిల్ అవుతుందని కంపెనీ తెలిపింది.
జనవరి 15-16 రాత్రి ముంబైలోని బాంద్రాలో సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సమయంలో ఆరుసార్లు కత్తితో సైఫ్ పై పొడిచాడు. సైఫ్ పబ్లిక్ రిలేషన్స్ టీమ్ ప్రకారం, దాడి చేసిన వ్యక్తి రాత్రి 2:30 సమయంలో అతనిపై దాడి చేశాడు. శుక్రవారం విడుదలైన కొత్త వీడియోలో నిందితుడు తన ముఖాన్ని కప్పుకుని బ్యాక్‌ప్యాక్‌తో భవనంలోకి ప్రవేశించినట్లు చూపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి సైఫ్ భార్య కరీనా కపూర్ నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఏ అండర్ వరల్డ్ గ్యాంగ్ కాదని మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుడికి ఏ ముఠాతో సంబంధం లేదని ఆయన అన్నారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications