Sai Swami Metals Alloys IPO: ఎస్ఎమ్ఈ ఐపీవోల్లో ఏం నడుస్తోందంటే.. లాభాల కోలాహలం నడుస్తోందని ఇన్వెస్టర్లు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ల పతనం ఉన్నప్పటికీ ఐపీవోలు మాత్రం అవి పట్టించుకోకుండా క్షణాల్లో డబ్బును డబుల్ చేసేస్తూ సాగిపోతున్నాయి. నేడు ఐపీవోలు ఇన్వెస్టర్లకు లక్ష్మీదేవి దీవెనలు 100 శాతం లాభాల రూపంలో అందాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సాయి స్వామి మెటల్స్ & అల్లాయ్స్ లిమిటెడ్ ఐపీవో గురించే. నేడు కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో 90 శాతం ప్రీమియం రేటు వద్ద జాబితా అయ్యాయి. ఒక్కో షేరు రూ.114 రేటు వద్ద జాబితా అయ్యాయి. లిస్టింగ్ తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో BSE ఇండెక్స్‌లో షేరు ధర రూ.119.70 స్థాయికి చేరుకుంది. వాస్తవానికి కంపెనీ ఐపీవో ఇష్యూ సమయంలో గరిష్ఠంగా రూ.60 రేటుకు విక్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీవో ఇన్వెస్టర్ల నుంచి పొందిన భారీ డిమాండ్ కారణంగా పెట్టుబడిపై రెట్టింపు లాభాలను అందించింది.

సాయి స్వామి మెటల్స్ & అల్లాయ్స్ ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.15 కోట్లను సమీకరించింది. ఈ క్రమంలో ఎస్ఎమ్ఈ ఐపీవో 25,00,000 షేర్లను విక్రయానికి ఉంచగా రూ.128.98 కోట్లు విలువైన షేరలకు దరఖాస్తు వచ్చాయి. ఇష్యూ చివరి రోజు నాటికి ఐపీవో 543 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో సాయి స్వామి మెటల్స్ & అల్లాయ్స్ 533 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందగా.. నాన్ రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 538 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదు చేసింది. గుజరాత్ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఐపీవోలో 25 లక్షల కొత్త షేర్లు జారీ చేయబడ్డాయి.
ఏప్రిల్ 30న ప్రారంభమై మే 3న ముగిసిన ఐపీవో ఫిక్స్‌డ్ రేటు ప్రాతిపదికన షేర్లను రూ.60 చొప్పున విక్రయించింది. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల(RII) కోసం ఐపీవో 50 శాతం రిజర్వ్ చేయబడింది. సాయి స్వామి మెటల్స్ డాల్ఫిన్ బ్రాండ్ క్రింద వంట పాత్రలు, సంబంధిత పరికరాల వ్యాపారంలో ఉంది. సెప్టెంబర్ 2022లో స్థాపించబడిన కంపెనీ ఉత్పత్తి శ్రేణిలో డిన్నర్ సెట్‌లు, SS క్యాస్రోల్స్, SS మల్టీ కడై, SS వాటర్ బాటిల్స్, స్టెయిన్‌లెస్ స్టీల్ షీట్‌లు, స్టెయిన్‌లెస్ స్టీల్ సర్కిల్‌లు, వివిధ పాత్రలు వంటి అనేక రకాల వంట సామాగ్రి తయారీ విక్రయంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications