Kalamandir IPO: త్వరలో ఐపీఓకు రానున్న కళామందిర్.. సెబీకి డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ దాఖలు..
సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ త్వరలో ఐపీఓకు రానుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) కోసం డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. IPOలో రూ.600 కోట్లను సేకరించనున్నారు. ఇందుకు 18,048,440 ఈక్విటీ షేర్లకు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. ఈక్విటీ షేర్ల ముఖ విలువ ఒక్కొక్కటి రూ.2 నిర్ణయించారు.

రిటైల్ పెట్టుబడిదారులకు 35%
మొత్తం ఇష్యూ పరిమాణంలో 50% అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs) రిజర్వ్ చేస్తారు. 15% సంస్థాగత పెట్టుబడిదారులకు (NII) కేటాయిస్తారుు. మిగిలిన 35% షేర్లు రిటైల్ పెట్టుబడిదారులకు (RII) రిజర్వర్ చేస్తారు. రెగ్యులేటరీ ఆమోదం తర్వాత IPO ప్రైస్ బ్యాండ్, ప్రారంభ తేదీ ప్రకటించనున్నారు.

కొత్తగా 25 షోరూమ్‌లు
పబ్లిక్ ఇష్యూ ద్వారా సంస్థకు లభించే నిధులతో కొత్తగా 25 షోరూమ్‌లు, రెండు గోదాములు ప్రారంభించాలని డ్రాఫ్ట్ లో పేర్కొన్నారు. కొంత సొమ్మును అప్పు తీర్చడానికి, కార్పొరేట్ అవసరాలకు కేటాయించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో సాయి సిల్క్స్ కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, మందిర్, కేఎల్‌ఎం ఫ్యాషన్ మాల్ బ్రాండ్లతో దుస్తుల విక్రయశాలలు నడిపిస్తోంది.

ప్రస్తుతం 46 షోరూమ్‌లు
సాయి సిల్క్స్ కు కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం 46 షోరూమ్‌లు ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్, ఎడెల్‌వీస్ ఎన్‌ఎస్‌ఇ 0.18%, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎన్‌ఎస్‌ఇ 2.33% IPO కోసం బ్యాంకర్‌లుగా నియమించే అవకాశం ఉంది. ఫ్యాషన్ రిటైలర్లలో ఫిబ్రవరిలో సెలబ్రేషన్ వేర్ కంపెనీ వేదాంత్ ఫ్యాషన్స్ NSE -0.98% రూ. 3,149 కోట్లను సేకరించడానికి పబ్లిక్‌గా వెళ్లింది. అయితే గో ఫ్యాషన్ NSE 0.94% గత నవంబర్‌లో రూ. 1,014 కోట్లు సేకరించింది.


Click it and Unblock the Notifications