IPO News: మార్కెట్లోకి తెలుగు ఫ్యాషన్ కంపెనీ ఐపీవో.. నేడే ప్రారంభం.. పూర్తి వివరాలు..
IPO News: దేశంలో అనేక కంపెనీలు తమ పెట్టుబడి అవసరాల కోసం స్టాక్ మార్కెట్లలోకి అడుగు పెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ కూడా చేరిపోయింది. నేడు ప్రారంభమైన ఐపీవో గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. ఈ ఐపీవో సెప్టెంబర్ 20న ప్రారంభమై సెప్టెంబర్ 22న ముగుస్తుంది. దీనికోసం కంపెనీ తన స్టాక్ ప్రైస్ బ్యాండ్ రూ.210-222గా నిర్ణయించింది. పైగా ఈ ఐపీవో నుంచి మెుత్తంగా కంపెనీ రూ.1,201 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందులో రూ.600 కోట్లు విలువైన ఫ్రెష్ ఇష్యూ ఉండగా మిగిలింది ఆఫర్ ఫర్ సేల్.

ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టింగ్ అవుతున్న కంపెనీ క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ల కోసం 50 శాతం, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం కోటాను రిజర్వు చేసింది. కంపెనీ ఐపీవో లాట్ సైజ్ 67 షేర్లుగా నిర్ణయించింది. ఒక్కో షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.2గా కంపెనీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కంపెనీ షేర్లను అక్టోబర్ 3న అలాట్ చేయనుంది. అలాగే స్టాక్ అక్టోబర్ 4న లిస్ట్ అవనుందని తెలుస్తోంది.
కంపెనీకి నాగకనక దుర్గా ప్రసాద్ చలవాడి, ఝాన్సీ రాణి చలవాడి ప్రమోటర్లుగా ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ వివిధ నగరాల్లో ఫ్యాషన్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. కళామందిర్, వరమహాలక్ష్మి సిల్స్క్, మందిర్, KLM ఫ్యాషన్ మాల్ పేరిట వివిధ కస్టమర్లకు విభిన్న ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మెుత్తం 54 స్టోర్లను నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications