Gold: బంగారం కొనాలా? వద్దా? ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టిన మ్యూచువల్ ఫండ్ ఎక్స్‌పర్ట్!

గోల్డ్ మార్కెట్‌లో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయి లాభాలను అందించిన బంగారం (Gold), వెండి(Silver) ధరలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2022లో వెండి ధర 20 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడే దాని భవిష్యత్తు పెరుగుదలను కచ్చితంగా అంచనా వేసిన డీఎస్పీ (DSP) మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్.. ఇప్పుడు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరల వద్ద కొత్తగా పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తున్నారు.

Sahil Kapoor Warning on Gold and Silver Prices and Valuation for Investors in 2026

2022 నాటి అంచనా.. నేటి వాస్తవం

2022లో చాలా మంది మార్కెట్ నిపుణులు వెనుకాడుతున్న సమయంలో సాహిల్ కపూర్ బంగారం, వెండిపై సానుకూల అంచనా వేశారు. అప్పట్లో సరఫరా తక్కువగా ఉండటం, సెంట్రల్ బ్యాంకుల నుంచి డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయని ఆయన చెప్పారు. ఆయన ఊహించినట్లుగానే గడిచిన రెండేళ్లలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బంగారం, వెండి వాటి అసలు విలువ (Fair Value) కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయని ఆయన గణాంకాలతో వివరిస్తున్నారు.

ఎందుకు అప్రమత్తంగా ఉండాలి?

బంగారం డిమాండ్‌ లో గతంలో ఉన్న స్థిరత్వం ఇప్పుడు కనిపించడం లేదు. సాహిల్ కపూర్ విశ్లేషణ ప్రకారం..

  • సెంట్రల్ బ్యాంకుల వెనకడుగు: 2022-24 మధ్య ఏటా 1,000 టన్నుల బంగారం కొన్న సెంట్రల్ బ్యాంకులు.. 2025లో తమ కొనుగోళ్లను 20 శాతం తగ్గించుకున్నాయి.
  • నగల డిమాండ్ పతనం: సాధారణంగా సగం డిమాండ్‌ను భరించే జ్యువెలరీ రంగం, ధరలు పెరగడంతో 25 శాతం తగ్గి 1,600 టన్నులకు పరిమితమైంది.
  • అస్థిరమైన పెట్టుబడిదారులు: ప్రస్తుతం మార్కెట్‌ ను నడిపిస్తున్నది కేవలం ముమెంటం బయర్స్ (Momentum Buyers), ఈటీఎఫ్ (ETF) ఇన్వెస్టర్లు మాత్రమే. వీరు లాభాలు రాగానే త్వరగా వెనక్కి తగ్గుతారు. దీనివల్ల ధరలు ఒక్కసారిగా పడిపోయే ముప్పు ఉంది.

ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?

బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేసిన వారు తమ పోర్ట్‌ఫోలియోను ఒకసారి చెక్ చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

  • కొత్త కొనుగోళ్లు వద్దు: ప్రస్తుతం ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నందున కొత్తగా లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం మంచిది కాదని ఆయన అభిప్రాయం.
  • రీ-బ్యాలెన్సింగ్: మీ పెట్టుబడిలో బంగారం వాటా 5 శాతం ఉండాల్సింది 10 శాతానికి పెరిగితే దానిని తిరిగి సాధారణ స్థాయికి తగ్గించుకుని లాభాలను స్వీకరించడం ఉత్తమం.
  • బంగారానికే మొగ్గు: దీర్ఘకాలికంగా చూస్తే వెండి కంటే బంగారమే ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మంచి రిటర్న్స్ ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. వెండిని కేవలం పదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశంగా మాత్రమే చూడాలని సలహా ఇచ్చారు.

మార్కెట్ గరిష్ట స్థాయిని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ, రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది ముఖ్యం. ప్రస్తుతం బంగారం ధరల పరుగు ఆఖరి దశలో ఉండవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+