Sahara News: సుబ్రతారాయ్ మరణంతో మారిన కథ.. ప్రభుత్వ ఖజానాకు సహారా సొమ్ము..!!
Sahara News: సహారా ఇండియా అధినేత సుబ్రతా రాయ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఆయన మరణించిన తర్వాత కేసు ఏమౌతుంది? డబ్బులు పెట్టుబడిదారులుకు వస్తాయా? అసలు ఈ మెుత్తానికి బాధ్యత ఎవరు వహిస్తారనే అనుమానాలు పెద్ద చర్చకు దారితీశాయి.
ఈ క్రమంలో చిన్న మెుత్తాలను సహారాలో దాచుకున్న లక్షలాది పెట్టుబడిదారుల సొమ్ము ఏమవుతుందనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. నివేదికల ప్రకారం ప్రస్తుతం సహారా-సెబీ రీఫండ్ ఖాతాలో క్లెయిమ్ చేయబడని నిధులను ఏకీకృత ఫండ్‌కు బదిలీచేయాలనే ఆలోచన పరిగణించబడుతోంది. దీనిపై ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటోంది. దీనివల్ల భవిష్యత్తులో పెట్టుబడిదారులు తమ రీఫండ్‌ను క్లెయిమ్ చేసినప్పుడు డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు 48,326 ఖాతాలకు రూ.138 కోట్లు బదిలీ అయ్యాయి. క్లెయిమ్ చేయని డబ్బును సంక్షేమ పథకానికి ఉపయోగించవచ్చని ఒక అధికారి ఈటీతో మాట్లాడుతూ చెప్పారు.

సహారా గ్రూప్ నుంచి మొత్తం రూ.25,163 కోట్లు రికవరీ అయ్యాయి. ఈ మెుత్తం సొమ్ము ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేయబడింది. వాస్తవానికి 2012లో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తన ఆర్డర్‌లో పెట్టుబడిదారుల డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని సహారా గ్రూప్ కంపెనీలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. పెట్టుబడిదారులను గుర్తించలేకపోయినట్లయితే ఆ నిధులను ప్రభుత్వానికి జమ చేస్తామని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ.5,000 కోట్లు కేంద్ర సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు బదిలీ చేయబడ్డాయి. కొత్త ఆర్డర్ ప్రకారం డబ్బును 9 నెలల్లో పెట్టుబడిదారుల ఖాతాలకు బదిలీ చేయాలి. లేకుంటే డబ్బు మళ్లీ సహారా-సెబీ రీఫండ్ ఖాతాకు పంపబడుతుంది. డబ్బును తిరిగి వెనక్కి అందించేందుకు వీలుగా రీఫండ్ పోర్టల్ రూపొందించబడినప్పటికీ.. ఇంకా పెద్ద సంఖ్యలో హక్కుదారులు తమ సొమ్ము తీసుకునేందుకు ముందుకు రాలేదు. పోర్టల్‌కి వెళ్లి తన రశీదును అప్‌లోడ్ చేయడం ద్వారా వాపసు పొందవచ్చు. అలాగే పోర్టల్‌లో అందించిన ఫారమ్ నింపి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications