ఇన్వెస్టర్లను మోసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సహారా గ్రూప్ ఇప్పటి వరకు రూ.15,448.67 కోట్ల మొత్తాన్ని సెబీ-సహారా రీఫండ్ ఖాతాలో జమ చేసిందని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. అనుమతులు లేకుండానే డిబెంచర్లు జారీ చేసి నిధులు సమీకరించినట్లుగా సహారా రియాల్టీ, హౌసింగ్ సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.
సహారా గ్రూప్ ఇప్పటి వరకు తమ ఇన్వెస్టర్లకు ఇచ్చేందుకు గాను రూ.15,448.67 కోట్లను జమ చేసిందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ లోకసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.

సెబికి అవసరమైన పత్రాలు సమర్పించకుండానే సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పోరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్‌లు రూ.3.07 కోట్ల మంది నుంచి వరుసగా రూ.19,400.87 కోట్లు, రూ.6,380.50 కోట్లను సేకరించాయి.
నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన ఆ మొత్తాలను వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీం కోర్టు.. సహారాను గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఆ సంస్థ సెబి-సహారా రీఫండ్ ఖాతాలో రూ.1,5448 కోట్లు జమ చేసింది. సహారా బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.41.59 కోట్ల చెక్కు ఇంకా ఆదరణ పొందలేదని తెలిపారు.


Click it and Unblock the Notifications