Multibagger Stock: లక్షను రూ.9 లక్షలు చేసిన స్టాక్.. మీ దగ్గర ఉందా..??
Multibagger Stock: ఇటీవలి కొనసాగిన మార్కెట్ ర్యాలీ సమయంలో ఎక్కువగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీల షేర్లు మెరుగైన పనితీరును కనబరిచాయి. దీంతో అనేక మంది ఇన్వెస్టర్లు ఊహించని లాభాలను పొందారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సఫారీ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల గురించే. ఆగస్టు 2020లో కంపెనీ షేర్ ధర దాదాపు రూ.400 వద్ద ఉంది. అయితే మల్టీబ్యాగర్ స్టాక్ ఆగస్టు 21,2023న దాని ఆల్-టైమ్ హై రూ.3,602.15ను తాకింది. గడచిన మూడేళ్ల కాలంలో స్టాక్ ఏకంగా 800 శాతం రాబడిని అందించింది. కేవలం ఒక్క ఏడాదిలో స్టాక్ 140 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు ఇచ్చింది.

ఈ కంపెనీ లగేజ్, లగేజ్ యాక్సిసరీస్ రంగంలో వ్యాపారం చేస్తోంది. ఎవరైనా ఇన్వెస్టర్ మూడేళ్ల కిందట కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అది రూ.9 లక్షలను దాటి ఉండేది. ఇదే క్రమంలో బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లీలాదర్ కంపెనీ షేర్లపై సానుకూల ధృత్పదాన్ని వ్యక్తం చేసింది.
జూన్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 88 శాతం పెరిగి 49.94 కోట్లకు చేరుకుంది. తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం మెుత్తంగా రూ.426.68 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో కంపెనీ EBITDA మార్జిన్ పెరిగి 18.5 శాతంగా నమోదైంది. 3000 మార్కు దగ్గర కన్సాలిడేషన్ బ్రేక్‌అవుట్ తర్వాత స్టాక్ బలంగా ఊపందుకుంది. సంవత్సర ప్రాతిపదికన దాదాపు 110 శాతం రాబడితో, సఫారి ఇండస్ట్రీస్ విపరీతమైన డ్రీం రన్‌ను చూసింది. రూ.3,728 టార్గెట్ ధరతో స్మాల్ క్యాప్ స్టాక్‌పై బ్రోకరేజ్ 'కొనుగోలు' రేటింగ్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications