IPO News: ఐపీవో లిస్టింగ్‌తో.. సచిన్ టెండూల్కర్‌కి రూ.23 కోట్లు లాభం..! మీరూ కొన్నారా..??
Azad Engineering IPO: ఇటీవల వరుస ఐపీవోలు ఇటు సాధారణ ఇన్వెస్టర్లతో పాటు అటు సెలబ్రిటీలను సైతం ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లోకి వస్తున్న డిఫెన్స్ ఐపీవో గ్రేమార్కెట్లో దూకుడు కనబరుస్తోంది.
ఈ క్రమంలోనే క్రికెట్‌లో అందరూ దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్ పెట్టుబడులు పెట్టిన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ ఐపీవో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వాస్తవానికి శుక్రవారం నాడు ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. అయితే చివరి రోజున మొత్తం 80.60 రెట్లు అధిక దరఖాస్తులను పెట్టుబడిదారుల నుంచి షేర్ల కోసం అందుకుంది. బలమైన డిమాండ్ తర్వాత గ్రేమార్కెట్లోనూ ఐపీవో భారీ లాభాలతో దూసుకుపోతోంది.

ఈ క్రమంలో వచ్చే వారం ఐపీవో స్టాక్ మార్కెట్లలో జాబితాకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో దాదాపు 9 నెలల కిందటే సచిన కొంత మెుత్తంలో పెట్టుబడులు పెట్టారు. తాజా లిస్టింగ్ ద్వారా టెండూల్కర్ కంపెనీ నుంచి మల్టీబ్యాగర్ రాబడులను అందుకుంటారని తెలుస్తోంది. వాస్తవానికి ఐపీవో గరిష్ఠ ఇష్యూ ధర రూ.524గా ఉండగా.. దీంతో సచిన పెట్టుబడి పెట్టిన రూ.5 కోట్ల మెుత్తం విలువ ప్రస్తుత గ్రేమార్కెట్ విలువ ప్రకారం లిస్టింగ్ తర్వాత రూ.22.96 కోట్లకు చేరుకోనుది. అంటే పెట్టుబడిపై 360 శాతం రాబడిని క్రికెటర్ పొందనున్నారు.
ఏడాది మార్చిలో సచిన తన డబ్బును ఇన్వెస్ట్ చేయగా ఆ తర్వాత కంపెనీ కంపెనీ స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్లను అందించటంతో.. సచిన్ ఇప్పుడు కంపెనీలో 4,38,210 షేర్లను కలిగి ఉన్నారు. అలాగే ఈ కంపెనీలో ఇతర ప్రముఖ పెట్టుబడిదారులను గమనిస్తే.. PV సింధు, సైనా నెహ్వాల్, VVS లక్ష్మణ్ ఒక్కొక్కరు రూ. కోటి చొప్పున పెట్టుబడులను కలిగి ఉన్నారు. ఇక ఐపీవో సంగతి పరిశీలిస్తే తాజా ఇష్యూ ద్వారా మెుత్తం రూ.740 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications