Sachin Tendulkar: కొత్త బిజినెస్‌లోకి సచిన్ కంపెనీ అడుగులు.. వేలాది కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటన
Semi Conductor: అభివృద్ది పథంలో మరింత ముందుకు సాగేందుకు మాన్యుఫ్యాక్చరింగ్ రంగంపై భారత్ దృష్టి సారించింది. దేశానికి అవసరమైన సెమీకండక్టర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా.. వాటిని స్థానికంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టాటాలు సహా మరికొన్ని ప్రముఖ సంస్థలు ఇందు కోసం ముందుకు వచ్చాయి.
గుజరాత్‌లో సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన మైక్రోన్ 6 వేల 650 కోట్ల పెట్టుబడిని గతేడాది ప్రకటించింది. ప్రస్తుతం టాటా గ్రూప్, సీజీ పవర్‌లు 1.3 లక్షల కోట్లతో సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేసిన RRP ఎలక్ట్రానిక్స్.. సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు 5 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.

మహారాష్ట్రలో సెమీకండక్టర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం ఈ మొత్తాన్ని RRP ఎలక్ట్రానిక్స్ వినియోగించనుంది. ఈ పెట్టుబడికి సంబంధించి 'సెమీకండక్టర్ రంగంలో మా కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగా రాబోయే 5 సంవత్సరాల్లో 5 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము' అని కంపెనీ తెలిపింది.
దీనిపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. 'ప్రపంచ అభివృద్ధికి గణనీయంగా దోహదపడే సాంకేతిక మౌలిక సదుపాయాలలో భారతదేశం పాల్గొంటోంది. ఈ మిషన్‌లో భాగమైన కంపెనీలో పెట్టుబడులు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో భారత్ ఈ విభాగంలో మరింత దూసుకు పోతుంది' అని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications