గత మూడు-నాలుగేళ్లుగా స్టాక్ మార్కెట్‌లో ఐపిఒలకు మంచి క్రేజ్ ఏర్పడింది. పెద్ద, చిన్న సహా అన్ని రకాల ఇన్వెస్టర్లుసైతం ఇంట్రెస్ట్ చూపించారు. అంతేకాదు చాల ఐపిఒలు కూడా ఉన్నాయి, వీటిలో టాప్ బాలీవుడ్ సెలెబ్రిటీల నుండి క్రికెట్ సెలబ్రిటీలు భారీ బెట్స్ వేసి ఊహించని రిటర్న్స్ సంపాదించారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐపిఒ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా పెట్టుబడిదారులకు గొప్ప రిటర్న్స్ ఇస్తుంది. ఈ ఐపిఒలలో చాలా వరకు టాప్ బాలీవుడ్, క్రికెట్ స్టార్‌లకు కలిసొచ్చాయి. సెలబ్రిటీలకి షేర్స్ ఉన్న కొన్ని IPOలు, కంపెనీల షేర్ల గురించి...
గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలోని ప్రముఖ సెలబ్రిటీలు ఐపిఒలో పెట్టుబడి పెట్టడం ద్వారా బంపర్ ప్రాఫిట్ సంపాదించారు. సచిన్ టెండూల్కర్ ఆజాద్ ఇంజినీరింగ్ IPOలో దాదాపు రూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టగా అతని పెట్టుబడి విలువ దాదాపు రూ.60 కోట్లకు చేరుకుంది. ఇక అలియా భట్ నైకాలో రూ. 4.95 కోట్ల పెట్టుబడి పెట్టగా ఆమె పెట్టుబడి రూ.54 కోట్లకు పెరిగింది. అంతేకాదు కత్రినా కైఫ్ 2018లో నైకాలో రూ.2.04 కోట్లు పెట్టుబడి పెట్టి లిస్టింగ్ సమయంలో ఆమె పెట్టుబడి దాదాపు 11 రెట్లు పెరిగి రూ.22 కోట్లకు చేరుకుంది.

మరోవైపు అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ IPO నుండి బిగ్ లాభాలను ఆర్జించారు. శిల్పా శెట్టి కుంద్రా మామ ఏర్త్‌లో రూ. 6.7 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక్కో షేరుకు రూ. 41.86 చొప్పున 16 లక్షల షేర్లను కొన్నారు. Mamaearth IPO ఆఫర్ ఫర్ సేల్ (OFS) భాగంలో 13.93 లక్షల షేర్లను అమ్మడం ద్వారా మంచి లాభాన్ని పొందారు. శిల్పాశెట్టి పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.45.14 కోట్లు ఆర్జించారు. ఆమెకి ఇప్పటికే కంపెనీలో దాదాపు 2.3 లక్షల షేర్స్ ఉన్నాయి.

విరాట్ అనుష్క కూడా
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ 2020 జనవరిలో ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ స్టార్టప్ గో డిజిట్‌లో రూ. 2.5 కోట్లు పెట్టుబడి పెట్టారు. కోహ్లి గో డిజిట్‌లో 2.66 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.75 చొప్పున మొత్తం రూ.2 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేశాడు. నటి అనుష్క శర్మ రూ.50 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీ షేర్లు 5% ప్రీమియంతో రూ.286 వద్ద లిస్ట్ కాగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మ 281% ప్రాఫిట్ పొందారు.
సచిన్ టెండూల్కర్ అండ్ రతన్ టాటా
ఫస్ట్‌క్రై పేరెంట్ కంపెనీ బ్రెయినీ సొల్యూషన్స్ IPOలో సచిన్ టెండూల్కర్, రతన్ టాటా కూడా ఇన్వెస్ట్ చేసారు. అక్టోబర్ 2023లో సచిన్ టెండూల్కర్ అతని భార్య అంజలి టెండూల్కర్ ఈ కంపెనీలో 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. రతన్ టాటా 2016లో ఒక్కో షేరుకు రూ.84.72 చొప్పున 77,900 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు రూ.66 లక్షలు పెట్టుబడి పెట్టారు, లిస్టింగ్‌లో వీరి పెట్టుబడి రూ.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్లు 40% ప్రీమియంతో రూ.651 వద్ద లిస్ట్ అయ్యాయి. దీని ధర రూ. 465.

అజయ్ దేవగన్
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ పనోరమా స్టూడియోస్‌లో పెట్టిన పెట్టుబడికి బ్లాక్ బస్టర్ రిటర్న్ పొందాడు. అయితే ప్రీ-ఐపిఓకు కాకుండా ప్రిఫరెన్షియల్ ఇష్యూలో ఈ షేర్లు పొందారు. మార్చి 4న దేవగన్ పనోరమా స్టూడియోస్‌కు చెందిన 1 లక్ష ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.274 చొప్పున కొన్నారు. ఈ పెట్టుబడి విలువ రూ.2.74 కోట్లు. మార్చి 2న అలాట్మెంట్ ముందు ధర రూ.948.4గా ఉంది. మార్చి 7న షేర్ రూ.995 వద్ద క్లోజ్ అయ్యింది, దింతో అజయ్ దేవగన్ పెట్టుబడి రూ.9.95 కోట్లకు చేరుకుంది.
అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్కి ప్రస్తుతం స్మాల్‌క్యాప్ కంపెనీ డిపి వైర్స్‌లో 2,98,545 షేర్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన డిపి వైర్స్‌లో అమితాబ్కి 1.93 శాతం వాటా ఉంది. తాజాగా కంపెనీ షేర్ల ధర రూ.404.90. అంటే నాలుగేళ్లలో కంపెనీ షేర్లు 600% పైగా పెరిగాయి.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications