సాత్విక్ గ్రీన్ ఎనర్జీ IPO: ఈసారి 1150 కోట్లు.. రెండవసారి సెబీకి దరఖాస్తు..
Saatvik green energy ipo: మీరు ఏదైనా కంపెనీ ఐపీఓ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ఎదురు చూస్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ తయారీ సంస్థ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ మరోసారి IPO కోసం ఫయిల్ దాఖలు చేసింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,150 కోట్లు సేకరించాలని యోచిస్తోంది. అయితే కంపెనీ ఇంతకుముందే SEBIకి IPO కోసం ఫయిల్ దాఖలు చేసిందని, కానీ ఫిబ్రవరిలో కంపెనీ ఫయిల్ తిరిగి పంపించింది తెలిపింది. అయితే, కంపెనీ గతంతో పోలిస్తే ఈ IPOలో ఎటువంటి మార్పు చేయలేదు.

ప్లాన్ ఏంటి : ఈ IPO ద్వారా ప్రమోటర్లు రూ.850 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేస్తారు అలాగే రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి ఆఫర్ చేస్తారు. కంపెనీ ప్రమోటర్లు ప్రమోద్ కుమార్ అండ్ సునీలా గార్గ్ ఆఫర్-ఫర్-సేల్ ద్వారా రూ.150 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తారు. కంపెనీలో ప్రమోటర్లకు 90.05 శాతం వాటా ఉంది. మిగిలిన 9.95 శాతం షేర్లను పబ్లిక్ షేర్ హోల్డర్ ప్రశాంత్ మాథుర్ చెందినవి.
IPO నుండి వచ్చే ఆదాయాలతో కంపెనీ ఏం చేస్తుందంటే: గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ లోన్ అలాగే దాని అనుబంధ సంస్థ సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్ లోన్ తిరిగి చెల్లించడానికి రూ.135.2 కోట్లు ఉపయోగిస్తుంది. దీనితో పాటు ఒడిశాలో 4 GW సోలార్ PV మాడ్యూల్ తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి రూ. 476.4 కోట్లు ఉపయోగించనుంది. ఈ ఇష్యూను నిర్వహించడానికి నియమించిన బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు DAM క్యాపిటల్ అడ్వైజర్స్, అంబిట్ అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.
సంస్థ పోటీదారులు : సాత్విక్ గ్రీన్ ఎనర్జీ, వారీ(Wari) ఎనర్జీస్ అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ వంటి లిస్టెడ్ కంపెనీలతో పోటీపడుతుంది. మార్చి 2024 తో ముగిసిన సంవత్సరంలో కంపెనీ లాభాలలో 21 రెట్లు ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ 2024తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో లాభం 239 శాతం పెరిగి రూ.122.9 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ గార్గ్. దీనితో పాటు మాణిక్ గార్గ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో కూడా ఉన్నారు.
సాత్విక్ గ్రీన్ ఎనర్జీ భారతదేశంలోని ప్రముఖ మాడ్యూల్ తయారీదారులలో ఒకటి, దీని ఆపరేషనల్ సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV) మాడ్యూల్ తయారీ సామర్థ్యం దాదాపు 3.80 గిగావాట్ల (GW) మాడ్యూల్స్. దీనికి 3.16 GW సోలార్ PV మాడ్యూళ్ల ఆర్డర్ బుక్ ఉంది. కంపెనీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సేవలను కూడా అందిస్తుంది. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో రూ.170 కోట్ల వరకు నిధులను సేకరించాలని పరిగణించవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే IPOలో కొత్త షేర్ల జారీ తగ్గుతుంది.


Click it and Unblock the Notifications