Multibagger Stock: దేశంలో ద్రవ్యోల్బణం, పెట్టుబడులను ఎఫ్ఐఐలు వెనక్కు తీసుకుంటున్న తరుణంలో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూస్తున్నాయి. కానీ.. ఈ క్రమంలో బీఎస్ఈలో లిస్ట్ అయిన S&T కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్ మాత్రం తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. గడచిన ఏడాది కాలంలో ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు 1500 శాతానికి పైగా రాబడిని అందించింది. బలహీనమైన మార్కెట్లలోనూ బలంగా పైకి లేచింది. వరుసగా 30 ట్రేడింగ్ సెషన్‌లలో షేర్ ధర పెరిగింది. మార్కెట్ల దిశకు వ్యతిరేకంగా ప్రయాణించి తన ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందించింది ఈ పెన్సీ స్టాక్.

ST కార్పొరేషన్ లిమిటెడ్ షేర్ ధర హిస్టరీ:
ST కార్పొరేషన్ షేర్లు జూన్ 29, 2021న రూ.13.45 నుంచి జూలై 01 నాటికి రూ. 271.30కి చేరుకుంది. అయితే షేర్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయి ఉంది. ఈ షేర్ నిరంతరం పెరుదుతూనే ఉంది. 2022లో ఇప్పటి వరకూ షేర్ దాదాపు 900 శాతం వరకు రాబడిని అందించింది. సంవత్సరం క్రితం ఈ స్టాక్ లో ఎవరైనా లక్షరూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. దాని విలువ ఇప్పుడు రూ.20 లక్షలకు పైగానే అయి ఉండేది.

మల్టీబ్యాగర్ రిటర్న్స్:
గత 6 నెలల్లో.. అంటే స్టాక్ 27 డిసెంబర్ 2021 నాటికి రూ.20.80గా ఉన్న స్టాక్.. ఇప్పటి వరకూ 950 శాతం వరకు రాబడిని అందించింది. ఇదే సమయంలో నిఫ్టీ ఇండెక్స్ పడిపోయింది. ఈ కాలంలో షేర్ మార్కెట్ కంటే మంచి పనితీరును కనబరిచింది. మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పటికీ లాభపడుతూనే ఉంది.

స్టాక్ గురించి కీలక అంశాలు:
ST కార్పొరేషన్ స్మాల్ క్యాప్ కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 135 కోట్లకు పైగానే ఉంది. ఈ సంస్థ టెక్స్‌టైల్, నిర్మాణ రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది. వాల్యూ రీసెర్చ్ అండ్ స్క్రీనర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. కంపెనీకి ఎలాంటి అప్పులేదు. స్టాక్ నిరంతరం పెరగటానికి ఇది ఒక ప్రధాన కారణం కావచ్చని తెలుస్తోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.271.30 గా ఉండగా.. షేర్ కనిష్ఠ ధర రూ.14.05గా ఉంది.

అత్యధికందా ప్రమోటర్లకు వాటా:
ప్రస్తుతం షేర్ తన గరిష్ఠ ధర వద్ద ట్రేడ్ అవుతోంది. పైగా ఈ కంపెనీకి స్ట్రెన్త్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్టాక్ 5 రోజులు, 20-రోజులు, 50-రోజులు, 100-రోజులు, 200-రోజుల మూవింగ్ యావరేజ్‌ల కంటే ఎక్కువగా రేటుకు ట్రేడ్ అవుతోంది. రూ.10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఈ స్టాక్ బుక్ విలువ రూ.20.40గా ఉంది. మార్చి 2022 నాటికి.. కంపెనీలో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 27.48 శాతం, ప్రమోటర్ల హోల్డింగ్ 72.52 శాతంగా ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications