భారత ఆర్థిక వ్యవస్థపై S&P గ్లోబల్ షాకింగ్ రిపోర్ట్.. మరో మూడేళ్లపాటు అంచనాలు ఎలా ఉన్నాయంటే..
Economy: అంతర్జాతీయ అనిశ్చితిలోనూ భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనీతీరు కనబరుస్తోంది. 2030 నాటికి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఎకానమీగా అవతరించనుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఇండియాపై ప్రముఖ రేటింగ్ సంస్థ S&P చేసిన వ్యాఖ్యలు కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.
'కరోనా వ్యాప్తికి ముందటితో పోలిస్తే మరో మూడేళ్లలో ఇండియన్ పబ్లిక్ ఫైనాన్స్ అంతగా మెరుగుపడే అవకాశం లేదు. సాధారణ ప్రభుత్వ లోటు మరియు అప్పులు 7-8 శాతం మధ్య ఉండవచ్చు' అని S&P గ్లోబల్ సీనియర్ డైరెక్టర్ ఫర్ APAC సావరిన్ రేటింగ్ కిమ్ ఎంగ్ టాన్ అంచనా వేశారు.

ఇండియా రుణాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉండటంతో.. భారత్ క్రెడిట్ ప్రొఫైల్ లో ఈ పెరామీటర్ అత్యంత బలహీనంగా ఉందని టాన్ తెలిపారు. అయితే స్థిరమైన దృక్పథంతో BBB- రేటింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అయితే దీనిని మెరుగుపరచుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2020-21 నాటికి GDPలో 9.2 శాతానికి పెరిగిన ద్రవ్య లోటును 2025-26 నాటికి 4.5 శాతం దిగువకు తీసుకురావాలని చూస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందస్తు సర్వే ప్రకారం.. కేంద్రం మరియు రాష్ట్రాల సంయుక్త ద్రవ్య లోటు ఈ ఏడాది GDPలో 8.7 శాతం, 2024-25లో 8.3 శాతంగా ఉండనుంది. ఇక 2022లో GDPలో 81 శాతం ఉన్న సాధారణ ప్రభుత్వ రుణం 2023లో 81.9, 2024లో 82.3 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. కానీ 2028లో క్రమంగా 80.5కు తగ్గుతుందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications