Indian Economy: ఇండియా టైమ్ ఆగయా..! ఇక రికార్డులే..
Indian Economy: ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధిపై నీలినీడలు అలుముకున్నప్పటీకి ఇండియా వీటికి భిన్నంగా నిలిచింది. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
భారత ప్రభుత్వం సైతం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని అందుకోవాలని కోరుకుంటున్న వేళ అది త్వరలోనే నెరవేరేటట్లు కనిపిస్తోంది. అవును 2030 నాటికి జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించే అవకాశం మెండుగా ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్(S&P Global Market Intelligence) నివేదించింది. ఈ దశాబ్దం చివరినాటికి భారత జీడీపీ 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2022లో ఇది 3.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు పేర్కొంది.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఎక్కువ కాలం పట్టబోదని నివేదిక పేర్కొంది. గడచిన 10 ఏళ్ల కాలంలో FDI పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. ఈ పెరుగుదల యువత జనాభా ప్రొఫైల్, పట్టణ గృహ ఆదాయాల్లో వేగవంతమైన పెరుగుదల వల్ల నడపబడిందని వెల్లడించింది. 2022 నాటికి భారత్ యూకే, ఫ్రాన్స్ జీడీపీని అధిగమించింది. 2030 నాటికి జర్మనీ GDPని అధిగమిస్తుందని అంచనా వేయబడింది.
IMF అంచనాల ప్రకారం జపాన్ నామమాత్రపు జీడీపీ ఈ ఏడాది జర్మనీని అధిగమిస్తుందని పేర్కొంది. దీని వల్ల US డాలర్ ఆధారంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జపాన్ మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న వేళ భారత్ కొంత ఆశాజనకమైన పనితీరుతో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.


Click it and Unblock the Notifications