ఉక్రెయిన్‌తో యుద్ధం, ఆ తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాల కఠిన ఆంక్షల నేపథ్యంలో, స్విఫ్ట్ నుండి తొలగింపులు వంటి వివిధ అంశాల కారణంగా రష్యా కేంద్ర బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. కఠిన ఆంక్షల నేపథ్యంలో రష్యన్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు ప్రతికూలంగా మారడంతో క్యాపిటల్ మార్కెట్లు వరుసగా మూతబడ్డాయి. సోమవారం నుండి బుధవారం వరకు మరుసగా మూడో రోజు వర్క్ చేయలేదు. స్టాక్ మార్కెట్లు తెరుచుకోనప్పటికీ రష్యా స్టాక్స్ పతనమవుతున్నాయి. ఇందుకు కారణం విదేశీ స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదైన ఆ దేశ ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్స్ వ్యాల్యూ క్షీణిస్తోంది.

అప్పుడు ఇప్పుడు
రష్యా స్టాక్ మార్కెట్లు 1998 తర్వాత మొదటిసారి వరుసగా దీర్ఘకాలం పాటు క్లోజ్ అయ్యాయి. రష్యా లోకల్ మార్కెట్లు వరుసగా మూడు రోజుల పాటు క్లోజ్ అయ్యాయి. అక్టోబర్ 1998లో అసాధారణ పరిస్థితుల్లో మాస్కో స్టాక్ ట్రేడింగ్ మూడు రోజుల పాటు నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి నిలిచిపోయింది.

పెట్టుబడులు నిలిచి క్షీణించాయి
అమెరికా, యూరోపియన్ దేశాల స్విఫ్ట్ నిషేధంతో రష్యా మార్కెట్ మూతకు కారణమయమయాయి. ఆ దేశానికి చెందిన బ్లాక్ రాక్ కొత్త ఫండ్స్ కొనుగోలుపై అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచించింది. రష్యా కరెన్సీ రూబుల్ భారీగా పతనమవుతోంది. కరెన్సీ పతనానికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం విధించిన ఆంక్షలు కూడా మార్కెట్ ట్రేడింగ్‌కు అడ్డంకిగా మారాయి. అమెరికా ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయిన రష్యాకు చెందిన రెండు ట్రేడెడ్ ఫండ్స్ వ్యాల్యూ ఈ యుద్ధ సమయంలో మూడింట ఒకవంతు పడిపోయింది. మరికొన్ని ఫండ్స్ వ్యాల్యూ ఐదింట మూడింతలు పడిపోయింది. ఈ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నిలిచిపోవడం ప్రభావం చూపింది.

భారత్‌కు పెట్టుబడులు
అమెరికా, యూరోపియన్ దేశాల కఠిన ఆంక్షలు భారత్‌కు ప్రయోజనకరంగా మారవచ్చునని అంటున్నారు. ఇప్పటి వరకు రష్యాలో పెట్టుబడిపై నియంత్రణలు లేనప్పటికీ, స్టాక్ మార్కెట్ మూసివేత అంతర్జాతీయ ఇండెక్స్ ప్రొవైడర్లు ఎంఎస్‌సీఐ, ఎఫ్‌టీఎస్ఈ సూచీల నుండి అక్కడి స్టాక్స్ తొలగింపు ఉండవచ్చునని అంటున్నారు. ఎంఎస్‌సీఐ, ఎఫ్‌టీఎస్ఈలు తమ సూచీల నుండి రష్యన్ స్టాక్స్‌ను తొలగిస్తే అధి భారత మార్కెట్లకు కలిసి రావొచ్చునని అంటున్నారు. పైగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మన సూచటీలు భారీ కనిష్టాలకు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో భారత్‌కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావొచ్చు.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications