ప్రపంచం అంతా బంగారు నిల్వల కోసం ప్రయత్నిస్తుంటే.. రష్యా మాత్రం తన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ను అమ్మేసుకుంటుంది. బడ్జెట్ లోటుని పూడ్చేందుకు రష్యా ఈ నిర్ణయం తీసుకుంటునట్టు సమాచారం. దీని గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రష్యా సెంట్రల్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ రష్యా తన నిల్వల్లో ఉన్న భౌతిక బంగారాన్ని (Physical gold reserves) విక్రయించడం ప్రారంభించింది. ప్రభుత్వ బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం బ్యాంక్ ఆఫ్ రష్యా ప్రకటించింది. నిజానికి దీనికి ముందు కూడా రష్యా నేషనల్ వెల్త్ ఫండ్ నుంచి బంగారం లావాదేవీలు జరిగాయి. అయితే ఆ లావాదేవీలు ఎక్కువగా వర్చువల్‌గా ఉండేవి. గతంలో రష్యా ప్రభుత్వం బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్‌కు విక్రయించేది. అంటే అవి కూడా దేశం యొక్క గోల్డ్ రిజర్వ్స్ లో భాగమే. కానీ, ఇప్పుడు బ్యాంకు నుంచి కూడా బంగారం ఖాళీ అవుతోంది.
రష్యా గోల్డ్ హోల్డింగ్స్ ఇవే..
రష్యా గతంలో వర్చువల్ గా బంగారాన్ని బ్యాంకుకి అమ్మి బడ్జెట్ లోటుని పూడ్చుకునేది. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా ఫిజికల్ గోల్డ్ ను అమ్మేస్తుంది. రష్యా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన దేశం. రష్యా దగ్గర మొత్తం 2,300 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని అమ్మాల్సి రావడం నిజంగా విశేషం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కారణం ఇదేనా?
రష్యా సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధి ఒకరు దీని గురించి మాట్లాడుతూ, "ఇటీవలి కాలంలోదేశీయ బంగారు మార్కెట్‌లో లిక్విడిటీ పెరిగింది. అందుకే బ్యాంక్ ఆఫ్ రష్యా ఇప్పుడు దేశీయ మార్కెట్‌లో యువాన్ లావాదేవీలతో పాటు పాక్షికంగా బంగారం ద్వారా కూడా లావాదేవీలు నిర్వహిస్తోంది" అని తెలిపారు. అయితే, ఈ విక్రయాలు ఎప్పుడు జరిగాయి? వాటి పరిమాణం ఎంత అనే వివరాలను బ్యాంక్ వెల్లడించలేదు. అయితే అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు మాత్రం దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రష్యా బంగారాన్ని అమ్మేయడానికి ఇదొక్కటే కారణం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
తగ్గిపోతున్న నేషనల్ వెల్త్ ఫండ్
ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి ముందు రష్యా నేషనల్ వెల్త్ ఫండ్‌లో 405.7 టన్నుల బంగారం ఉండేది. అయితే ఇప్పుడు అది భారీగా తగ్గిపోతుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ లోటును కవర్ చేయడానికి ఈ నిల్వల్లో 57% (అంటే 232.6 టన్నులు) విక్రయించింది. నవంబర్ 1 నాటికి నేషనల్ వెల్త్ ఫండ్ లో కేవలం 173.1 టన్నుల బంగారం మాత్రమే మిగిలి ఉంది. నేషనల్ వెల్త్ ఫండ్ లో బంగారం, యువాన్‌లు మొత్తం కలిపి లిక్విడ్ ఆస్తులు 55% తగ్గి 51.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
ఈ బెనిఫిట్స్ ఉన్నాయి
ఈ బంగారు అమ్మకాల వల్ల రష్యా సెంట్రల్ బ్యాంక్‌కు చాలా విధాలుగా బెనిఫిట్స్ ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ విక్రయాల ద్వారా మార్కెట్‌లోకి విదేశీ కరెన్సీని (Forex) పంపడానికి సెంట్రల్ బ్యాంక్‌కు అవకాశం దొరుకుతుంది. అలాగే దేశీయ కరెన్సీ అయిన రూబుల్ బలపడుతుంది. చైనా కరెన్సీ అయిన యువాన్ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది.
ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం
రష్యా సెంట్రల్ బ్యాంక్ ఫిజికల్ గోల్డ్ ను అమ్మేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలపై స్వల్పంగానైనా ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద గోల్డ్ హోల్డర్ కాబట్టి పెద్ద మొత్తంలో బంగారం ఒకేసారి అమ్మకానికి వస్తే.. అంతర్జాతీయంగా పసిడి సరఫరా పెరిగి ధరలు స్వల్పంగా దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications