ఉక్రెయిన్‌తో యుద్ధం ఫలితం..కుప్పకూలుతున్న రష్యా అర్థిక వ్యవస్థ.. ఎంతలా అంటే..

Russia Recession Risk: రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభపు అంచుల్లోకి చేరుకుంది. 2022 నుండి ఉక్రెయిన్‌పై సైనిక దాడితో విరుచుకుపడుతోంది రష్యా. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితుల్లో ఉందని దేశ ఆర్థిక మంత్రి మాగ్జిమ్ రెషెట్నికోవ్ తెలిపారు.సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. దీనిపై రష్యా త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని తర్వాత తిరిగి లేవడం కష్టమని హెచ్చరించారు.

మహమ్మారి నుండి రష్యన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు అడుగులు వేస్తూనే ఉంది. గత మూడు సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనికి తోడు ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం కావడం మొదలైంది. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ఈ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండేదుకు వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. అయినా సరే ద్రవ్యోల్బణం 2024లో 9.5 శాతం ఉండగా.. 2025లో 9.8 శాతంగా ఉంది.

Russia monetary policy Russia recession risk economy minister Russia Russian economic slowdown interest rate policy Russia Russian central bank monetary reforms Russia avoid recession Russia Russia inflation policy Russian economy 2025 economic policy changes Russia 2025

కాగా 2022 తర్వాత ఈ నెలలో రష్యా వడ్డీ రేట్లను తగ్గించింది. దీని వల్ల రుణం తీసుకునే ఖర్చు 21 శాతం నుండి 20 శాతానికి తగ్గింది. అయినప్పటికీ వ్యాపారవేత్తలు రుణాలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.రష్యాలో అధిక వడ్డీ రేట్లు దేశంలో కొత్త పెట్టుబడులను నిరోధిస్తున్నాయని తెలుస్తోంది. తద్వారా దేశ ఆర్థిక వృద్ధి మందగిస్తోందని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.

2025 మొదటి త్రైమాసికంలో రష్యా ఆర్థిక వృద్ధి 1.4%కి పడిపోయింది. ఇది 2024లో 4.5% ఉండగా.. 2021లో 4.3% నుండి తగ్గింది. ఉక్రెయిన్ యుద్ధంపై విధించిన పాశ్చాత్య ఆంక్షల కారణంగా ఈ పతనం ఏర్పడింది. ఇది అధిక వ్యయంతో పాటుగా రష్యా ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. 2025 నాటికి రష్యా రక్షణ వ్యయం దాని GDPలో 8% మించిపోతుందని అంచనా వేశారు. ఇది సోవియట్ కాలం తర్వాత అత్యధిక స్థాయి అని గణాంకాలు చెబుతున్నాయి

ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా.. 2023లో రష్యా తన రక్షణ వ్యయాన్ని భారీగా పెంచింది. 2025లో రష్యన్ పార్లమెంట్ రూ. 10 లక్షల 67 వేల కోట్ల (126 బిలియన్ డాలర్లు) రక్షణ బడ్జెట్‌ను ఆమోదించింది. బడ్జెట్‌లో ఎక్కువ భాగం రక్షణ రంగానికి ఖర్చు చేస్తే, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు వంటి ప్రాథమిక విషయాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల విద్య, ఆరోగ్య సంరక్షణపై ఖర్చు తగ్గుతోందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. 2022 ఉక్రెయిన్ దాడి తర్వాత రష్యన్ సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన 300 బిలియన్ల డాలర్ల ఆస్తులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలు స్తంభింపజేశాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎల్విరా నబియుల్లినా మాట్లాడుతూ.. ఇక్కడి వ్యాపార పరిస్థితులు చూస్తుంటే.. మనం ఇప్పటికే మాంద్యం అంచున ఉన్నామని సూచిస్తున్నాయని అన్నారు. ఇక రష్యాలో అతిపెద్ద బ్యాంకు స్బేర్‌బ్యాంక్ మొదటి డిప్యూటీ సీఈఓ అలెగ్జాండర్ వేద్యాఖిన్ ఈ వారం రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా యొక్క కఠినమైన ద్రవ్య విధానం ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ప్రమాదాన్ని కలిగిస్తుందన్నారు.

దేశంలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, ఇతర కూరగాయలు, గుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. యుద్ధం కారణంగా చాలా మంది పౌరులు దేశం విడిచివెళ్లిపోతున్నారు. దీని వల్ల కార్మికుల కొరత ఏర్పడింది. మెరుగైన అవకాశాల కోసం ప్రజలు కూడా వలసపోతున్నారు. ఇది ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి కారణంగా 2024 వరకు 45 కి పైగా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థ చమురు, గ్యాస్ ఎగుమతిపై ఎక్కువగా ఆధారపడి ఉన్నందున ఎగుమతుల నుండి వచ్చే ఆదాయం పలు దేశాల ఆంక్షలతో భారీగా తగ్గింది. ఇవన్నీ రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారణం అవుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+