Russia: ఉక్రెయిన్ తో యుద్ధంపై రష్యాను తప్పుపడుతూ ఆయా దేశాలు పలు ఆంక్షలు విధించాయి. వివిధ ప్రాంతాల్లోని రష్యన్ల ఆస్తులను స్తంభింపచేశాయి. అయితే రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్.. వెస్ట్రన్ దేశాలకు గట్టి షాక్ ఇచ్చారు. ఈ అనూహ్య నిర్ణయంతో అమెరికా దాని మిత్ర దేశాల మైండ్ బ్లాక్ అయినట్లయింది.
రష్యన్ల ఆస్తులను వెస్ట్రన్ దేశాలు స్తంభింపచేయడంతో దానికి కౌంటర్ గా ఆయా దేశాలకు చెందిన ఇన్వెస్టర్ల సంపదను మాస్కో బ్లాక్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ డిక్రీపై సంతకం చేశారు. దీనిద్వారా రష్యాలో స్తంభింపజేసిన నిధులతో విదేశీ ఇన్వెస్టర్లు ఆయా దేశాల్లో ఉన్న రష్యన్ల ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. ఫలితంగా 3.5 మిలియన్లకు పైగా రష్యన్ల సంపద విదేశాల్లో బ్లాక్ అయింది. వీటి విలువ దాదాపు 1.5 ట్రిలియన్ రూబిల్స్ (16.3 బిలియన్ డాలర్లు)గా ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం వీటి విడుదలకు పుతిన్ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించడంతో తాజా ఆదేశాలు జారీ చేయబడినట్లు తెలుస్తోంది.
డిక్రీ ప్రకారం.. ప్రత్యేక 'టైప్-సి' ఖాతాల నుంచి నిధులను ఉపయోగించి విదేశాలలో స్తంభింపచేసిన సెక్యూరిటీలను కొనుగోలు చేయవచ్చు. అయితే 'అన్ ఫ్రెండ్లీ' దేశాల పౌరులు మాత్రమే ఇలా చేసేందుకు రష్యా అనుమతిస్తుంది. మొదటి దశలో సుమారు 100 బిలియన్ రూబిల్స్ విలువైన ఖాతాలను అన్‌బ్లాక్ చేయాలని యోచిస్తోంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications