రష్యా 2025లో భారతదేశం నుండి 10 లక్షల మంది కార్మికులను నియమించనున్నట్లు వచ్చిన వార్తలను రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉరాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఆండ్రే బెసెడిన్ ఇటీవల "రష్యా యుద్ధం కారణంగా కార్మికుల కొరతను తీర్చేందుకు 10 లక్షల మంది భారతీయులను నియమించనున్నాం" అని వ్యాఖ్యానించారు. అయితే, రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనను తిరస్కరించింది. భారతీయుల నియామకం సహా విదేశీ కార్మికుల నియామకానికి ప్రతి ఏడాది ముందుగానే కోటాలు నిర్ణయిస్తారని, ఆ కోటాల ప్రకారం మాత్రమే నియామకాలు జరుగుతాయని స్పష్టం చేసింది.

2025 సంవత్సరానికి రష్యాలో మొత్తం విదేశీ కార్మికులకు 2,34,900 కోటా ఉంది. ఇందులో భారతీయులకు కేటాయించిన కోటా 71,817 మాత్రమే. ప్రతి విదేశీ కార్మికుడు వీసా దేశాల నుండి వస్తే, ముందుగా వర్క్ వీసా, వర్క్ పర్మిట్ పొందాలి. కంపెనీలు కూడా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్న తర్వాతే విదేశీ కార్మికులను నియమించుకోవాలి.
ఇప్పటికే కొన్ని రష్యా కు సంబంధించిన కంపెనీలు ప్రయోగాత్మకంగా భారతీయ కార్మికులను నియమించాయి. ఉదాహరణకు, మాస్కోలోని సమోలియోట్ గ్రూపు అనే నిర్మాణ సంస్థ భారతీయ కార్మికులను నియమించేందుకు పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. అయితే భాషా సమస్యలు, సాంస్కృతిక తేడాలు, ఉద్యోగానికి తగిన నైపుణ్యాల లోపం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
మొత్తానికి, 2025లో 10 లక్షల మంది భారతీయులను నియమించాలన్న వార్తల్లో నిజం లేదని, కోటా ప్రకారం మాత్రమే నియామకాలు జరుగుతాయని రష్యా అధికారికంగా స్పష్టం చేసింది.
ఉరాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఆండ్రే బెసెడిన్ ప్రకారం, ఇప్పటికే భారత ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరాయి మరియు ఈ 10 లక్షల నియామకాల వార్తలు నిజం కావు అని వెల్లడించిన , నిజంగానే రష్యాలో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యువత ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు, చాలా మంది స్థానికులు యుద్ధానికి వెళ్లిపోతున్నారు. అందుకని ఈ రంగాల్లో భారతీయ కార్మికుల అవసరం ఎక్కువగా ఉంది.
ఈ నియామకం జరిగి ఉంటే రష్యాకు భారతీయ కార్మికులు చేరడం వల్ల మన భారతీయ కార్మికులు చాలా ఇబ్బందులు పాడేవారు. భారతీయ కార్మికులు అక్కడి ఉష్ణోగ్రతలకు (శీతాకాలంలో -17°C వరకు పడిపోతుంది) తగినట్లుగా తగిన బట్టలు ధరించాల్సి ఉంటుంది. భాషా సమస్యలు, సాంస్కృతిక తేడాలు, ఉద్యోగానికి తగిన నైపుణ్యాల లోపం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మన దేశ పని విధానాలు, జీవనశైలి అనుకూలతలో సమస్యలు వస్తున్నాయి. రష్యా కంపెనీల అవసరాలకు అనుగుణంగా భారతీయ కార్మికుల్లో తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల, ఉద్యోగానికి సిద్ధంగా ఉండడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications