For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Russia: తలకిందులైన రష్యా పరిస్థితి.. 100 ఏళ్లలో తొలిసారిగా ఇలా.. డబ్బుల్లేక..

|

రష్యా తన విదేశీ మారకద్రవ్య సార్వభౌమ రుణాన్ని దశాబ్దకాలంలో మొదటిసారి డిఫాల్ట్ చేసింది. 1918 తర్వాత ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా యూరోపియన్ దేశాలు విదేశీ రుణదాతలకు చెల్లింపు మార్గాలను మూసివేస్తూ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇది చోటు చేసుకుంది. ఉక్రెయిన్ పైన యుద్ధం నెలల తరబడి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. అయితే మే 27న దాదాపు 100 మిలియన్ డాలర్ల స్నేర్డ్ ఇంటరెస్ట్ చెల్లింపులపై గ్రేస్ పీరియడ్ గడువు ముగిసింది.

గడువు దాటితే డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. రష్యా ఆర్థికంగా, రాజకీయంగా దాదాపు ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొన్నది. మార్చి ప్రారంభం నుండి దేశీయ యూరోబాండ్స్ ఇబ్బందికరస్థాయిలో ట్రేడ్ అయ్యాయి. సెంట్రల్ బ్యాంకు విదేశీ నిల్వలు స్తంబింపచేయబడ్డాయి. రష్యాలోని ప్రపంచ అతిపెద్ద బ్యాంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి వేరు చేయబడ్డాయి.

Russia defaults on foreign currency sovereign debt for 1st time since 1918

అమెరికా సహా యూరోపియన్ దేశాల ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే రష్యాకు నష్టం జరిగిందని చెబుతారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు డిఫాల్ట్ దెబ్బపడింది. రెండంకెల ద్రవ్యోల్భణం, దారుణ ఆర్థిక సంకోచం నేపథ్యంలో ఇది కూడా ఆ దేశానికి మైనస్. అయితే డిఫాల్ట్ పైన రష్యా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తమ వద్ద అవసరమైన ఫండ్స్ ఉన్నాయని తెలిపింది. అయితే ఆ తర్వాత గతవారం 40 బిలియన్ డాలర్ల సార్వభౌమ రుణాన్ని రూబిళ్లలో అందిస్తామని ప్రకటించింది.

English summary

Russia: తలకిందులైన రష్యా పరిస్థితి.. 100 ఏళ్లలో తొలిసారిగా ఇలా.. డబ్బుల్లేక.. | Russia defaults on foreign currency sovereign debt for 1st time since 1918

Russia defaulted on its foreign currency sovereign debt for the first time in a century, the culmination of ever tougher Western sanctions that shut down payment routes to overseas creditors.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X