దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలవడంతో లాక్ డౌన్ విధించారు. దీంతో 135 కోట్ల మంది ఒక్కసారిగా ఇంటికే పరిమితమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, ఈ సంక్షోభ సమయంలో మనకు మూడు పూటలా తిండి పెట్టాలంటే అది కేవలం రైతుల వల్లే అవుతుంది. ఈ సత్యాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... లాక్ డౌన్ నుంచి వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇచ్చాయి. ఒక వైపు పట్టణాలన్నీ కర్ఫ్యూ తరహా వాతావరణంలో మగ్గి పోతుంటే... పల్లెలు మాత్రం పంట నూర్పిళ్ళు, అమ్మకాలతో కళకళ లాడుతున్నాయి. అక్కడ కూడా కొంత వైరస్ వ్యాప్తి భయాలు ఉన్నప్పటికీ... భగవంతుడి దయవల్ల ఇప్పటివరకు ఆందోళనకర పరిస్థితులు అయితే లేవు. లాక్ డౌన్ వల్ల అధికంగా పట్టణాలు, నగరాలు ప్రభావితం అవుతున్నాయి.
అక్కడ పూర్తిగా అన్ని రంగాలు కుదేలై ఎకానమీ పడకేసింది. ఈ సమయంలో ఇక ఇండియా ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే ఒక్క పల్లెటూరే దిక్కవుతోంది. అక్కడ రైతులు కూరగాయలు, పండ్లు, పాలు వగైరా సరఫరా ఆపేస్తే... పట్టణాల ఊపిరి ఆగిపోతుందని చెప్పవచ్చు. అంతటి కీలకమైన పల్లె కొన్ని దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు మినహా దేశంలో పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం కోసం రూ వేల కోట్లలో ఖర్చు చేస్తున్నది చాలా తక్కువ మందే అని చెప్పాలి. కానీ, వ్యవసాయంపై పెట్టుబడులు పెంచితే ఎంతటి ప్రయోజనం చేకూరుతుందో ప్రస్తుత సంక్షోభమే నిరూపిస్తోంది.

70% అక్కడే ...
భారత దేశం ఎప్పటి నుంచో వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో ఇప్పటికీ 70% ప్రజలు పల్లెల్లోనే ఉంటున్నారు. వారంతా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. కేవలం 30% మంది ప్రజలు మాత్రమే పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్నారు. అయితే, 1991 తర్వాత పల్లెల నుంచి పట్టణాలకు వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతులు కల్పించలేక ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. ఇదిలా ఉంటె... ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని 90 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు తిండికి ఇబ్బంది లేదు. వారి ఉత్పాదకత కూడా ఏమీ తగ్గలేదు. పైగా వీరంతా కలిసి మిగిలిన 45 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రపంచంలో మరే దేశానికీ లేని ప్రత్యేకత అని చెప్పాలి. లాక్ డౌన్ మొదలై నెల రోజులు గడిచినా... పట్టణాలు, నగరాల్లో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. అదీ మన గ్రామీణ భారత సత్తా.

20% మే 100% మందికి ఆధారం...
భారత జీడీపీ ప్రస్తుతం సుమారు 3 ట్రిలియన్ డాలర్లు గా ఉంది. అంటే సుమారు రూ 210 లక్షల కోట్లు. ఇందులో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల నుంచి 17-18% సమకూరుతోంది. ఇక సేవల రంగం వాటా సుమారు 60% గా ఉంటోంది. ఇందులో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల వాటా ఉంటోంది. ఇక మరో 21-22% వాటా తయారీ రంగం నుంచి సమకూరుతోంది. ప్రస్తుతం ఐటీ, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండగా.. మిగిలిన సేవల రంగం బాగా దెబ్బడింది. ఇక తయారీ రంగం పూర్తిగా పడకేసినట్లే. అందుకే, ఇక దేశాన్ని కాపాడాల్సింది ఒక్క రైతే. అందుకే జై కిసాన్ అని దేశమంతా జై కొట్టాల్సిందే. జీడీపీ లో వాటా 20% లోపే ఉన్నా... 100% మందికి తిండి పెట్టే రైతన్న బాగుండాలని మనమంతా కోరుకోవాలి. వారి సంక్షేమం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తమవంతు సహాయం అందిస్తే... మన రైతులు ప్రపంచం మొత్తానికి కూడా తిండి పెట్టే స్థాయికి ఎదుగుతారు.

వృద్ధి కాదు... మూలాలు ముఖ్యం..
లాక్ డౌన్ తో ఎకానమీ మొత్తం దెబ్బతింటుందని, వృద్ధి రేటు పడిపోతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక్క భారత దేశానికి మాత్రమే సంబంధించిన విషయం కాదని, మొత్తం ప్రపంచమే సంక్షోభంలో మునిగిపోయిందని వారంతా గుర్తించాలి. ప్రస్తుతం వైరస్ ను అడ్డుకోకపోతే.. అసలు ప్రాణాలకే ప్రమాదం కాబట్టి... లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాల్సిందే. పట్టణాలు, నగరాల్లో జన సాంద్రత అధికం కాబట్టి, వైరస్ వ్యాప్తి కి ఇక్కడే అధిక ఆస్కారం ఉంటుంది. కానీ, పల్లెల్లో పచ్చదనం అధికం. అలాగే జన సాంద్రత తక్కువ. అక్కడ వారికి భయాలు అవసరం లేదు. ప్రస్తుతం 70% మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు సమస్యలేకుండా చూడటం ముఖ్యం. ఎందుకంటే వారంతా బాగుంటే, మిగిలిన 30% మంది బాగోగులు ఆటోమాటిగ్గా తీరిపోతాయి. ఎకానమీ వృద్ధి తగ్గిపోతే... మళ్ళీ పెరుగుతుంది. కానీ, ప్రాణాలు పోతే తిరిగిరావు. కాబట్టి పట్టణాలు పడకేసినా... పల్లెలు మనల్ని కాపాడగలవు. ఆర్థికవేత్తలు చింతించకండి. భారత్ లో జవాన్లు, కిసాన్లు బాగున్నంత వరకు మనకు ఎలాంటి భయాలు అక్కరలేదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications