ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి, డాలర్‌తో పోలిస్తే ఎందుకింత పతనం

డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ భారీగా పతనమైంది. సోమ వారం నాటి ట్రేడింగ్‌లో రూ.77.41 వద్ద ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకున్నది. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, బాండ్స్ రాబడులు పెరగడం డాలర్ వ్యాల్యూ పెరగడానికి కారణమయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్ పతనం, ఇక్కడి ఈక్విటీ మార్కెట్ నుండి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం కూడా రూపాయి పతనానికి కారణమయ్యాయి.

డాలర్ మారకంతో రూపాయి 77.42 వద్ద ట్రేడ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన కరెన్సీలను అమెరికా డాలర్ వ్యాల్యూతో పోల్చే డాలర్ సూచీ 103.98కి చేరుకున్నది. టెన్ ఇయర్ అమెరికా బాండ్ యీల్డ్స్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 3.14 శాతానికి చేరాయి. ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచనున్నదనే వార్త డాలర్‌కు డిమాండ్ పెరగడానికి దోహదపడింది. ద్రవ్యోల్భణాన్ని అరికట్టేందుకు మున్ముందు వడ్డీ రేటును మరింత పెంచనున్నట్లు ప్రకటించడం కూడా కారణం.

Rupee weakens to all time low, Trading beyond 77.40 per Dollar

అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్ నుండి పెట్టుబడులను FPIలు ఉపసంహరించుకుంటారు. ఇప్పటి వరకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 2022లో భారత మార్కెట్ నుండి రూ.1.3 లవక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. రూపాయి బలపడటంతో రాబడి తగ్గింది. రూపాయి పతనంపై కాంగ్రెస్ స్పందిస్తూ రూపాయి ఐసీయూలో ఉందని, 75 ఏళ్లలో మొదటిసారి ఈ స్థాయికి పడిపోయిందని పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+