రూపాయి vs డాలర్: సామాన్యులకి దీనికి లింక్ ఏంటి.. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది..
సాధారణంగా మనం రోజు టివిలో లేదా పేపర్లో రూపాయి విలువ లేదా రూపాయి బలహీనపడింది, రూపాయి విలువ పడిపోయింది అని వింటుంటాం చూస్తుంటాం. అయితే రూపాయి విలువ పడిపోవడానికి బలపడడానికి చాల కారణాలు ఉంటాయి. దీనికి సామాన్యులకి లింక్ ఏంటి అనుకుంటున్నారా... ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఎప్పటికప్పుడు బలపడుతోంది. దింతో ఇవాళ శుక్రవారం డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 10 పైసలు బలపడి రూ.85.03 వద్ద ముగిసింది. దీని ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుంది, ఏ విధంగా చూపుతుంది ? ఈ ఆలోచన చాల మందికి ఉండే ఉంటుంది...
బలహీనపడ్డ రూపాయి అంటే ఏమిటి?
డాలర్ బలంగా ఉండటం లేదా రూపాయి బలహీనంగా ఉండటం అంటే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిందని అర్థం. సింపుల్ భాషలో ఇప్పుడు ఒక డాలర్ కొనడానికి మీరు ఇంతకుముందు కంటే ఎక్కువ రూపాయలు చెల్లించాలి. ప్రస్తుతం ఒక డాలర్ విలువ మన ఇండియాలో రూ.85.49

రూపాయి బలహీనపడటం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందా?
రూపాయి బలహీనపడినప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంటుంది. అంటే దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల సామాన్యులపై మరింత భారం పెరుగుతుంది.
రూపాయి బలహీనత వల్ల విదేశీ తగ్గుతాయా?
రూపాయి బలహీనపడితే దాని ప్రభావం విదేశీ పెట్టుబడులపై పడవచ్చు లేదా ఇన్వెస్టర్లపై ఉండొచ్చు. ఎందుకంటే రూపాయి బలహీనపడితే ఇన్వెస్టర్లు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడవచ్చు. దీని వెనుక కారణం భవిష్యత్తులో రూపాయి విలువ మరింత తగ్గుతుందని, దాని వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని భావిస్తారు.
రూపాయి బలహీనత కారణంగా వడ్డీ రేట్లు పెరగవచ్చా?
రూపాయిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇంకా రిజర్వ్ బ్యాంక్ కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి వడ్డీ రేట్లు కూడా పెంచవచ్చు. దీనివల్ల ప్రజలు లోన్లు తీసుకోవడం ఎక్కువ ఖర్చుతో ఉంటుంది. వ్యాపారాలపై కూడా దీని ప్రభావం కనిపించవచ్చు.
శుక్రవారం, US డాలర్ ఇండెక్స్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జోక్యం కారణంగా రూపాయి 10 పైసలు బలపడింది . డాలర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రూపాయి బలహీనపడే అవకాశం ఉందని విదేశీ మారకద్రవ్య వ్యాపారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications