Rupee vs Dollar: దేశ చరిత్రలో తొలిసారిగా రూపాయి మారకపు విలువ డాలర్ తో పోల్చుకుంటే భారీ పతనాన్ని చవిచూసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. 79.9863 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత డాలర్ తో పోలిస్తే రూపాయి చివరిగా 80.0163 వద్ద ఉంది. ఇంట్రా-డే రికార్డు కనిష్ఠ స్థాయి అయిన 80.0175ని తాకింది. బలహీనమైన రూపాయి మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. మరికొందరు ఆర్థిక వేత్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇది సామాన్యుల జీవితాలను ప్రభావితం చేస్తుందని వారు అంటున్నారు.

20 ఏళ్ల గరిష్ఠానికి డాలర్..
మాంద్యం భయాలతో డాలర్ బలపడటంతో పాటు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు దేశాన్ని విడిచి వెల్లడం వల్ల రూపాయితో పాటు ఇతర ఆసియా దేశాల కరెన్సీలు క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు డాలర్ 10% కంటే ఎక్కువ లాభపడింది. ఈ క్రమంలో 20 సంవత్సరాల గరిష్ఠాన్ని తాకింది. ఆర్థిక మాంద్యం భయాలు డాలర్ కు డిమాండ్ పెంచుతున్నాయి. దీనికి యూఎస్ ఫెడ్ పెంచుతున్న వడ్డీ రేట్లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఇతర కారణాలు కూడా కారణమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

విదేశీ పెట్టుబడులు తిరిగి వస్తే..
విదేశీ పెట్టుబడులు దేశంలోకి తిరిగి వస్తే రూపాయిపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐల నికర అవుట్‌ఫ్లో రూ.2.25 లక్షల కోట్లు ఉండగా.. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో ఇది రూ.52,987 కోట్లుగా ఉంది.

కంపెనీలపై ప్రభావం ఇలా..
ఈ క్యాలెండర్ ఇయర్ మూడో త్రైమాసికంలో రూపాయి విలువ రూ.82ని తాకుతుందని నోమురా సంస్థ అంచనా వేస్తోంది. ఉత్పత్తులు, సేవలను ఎగుమతి చేసే కంపెనీలకు రూపాయి పతనం మంచి లాభాన్ని అందిస్తుంది. విదేశాల నుంచి వస్తువులను, ముడి పదార్థాలను, సేవలను దిగుమతి చేసుకునే కంపెనీలపై చెల్లింపుల భారం పెరగటం వల్ల లాభాలు ఆవిరవుతాయని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
1. దిగుమతులు: దిగుమతి చేసుకునే వస్తువులకు చెల్లించడానికి దిగుమతిదారులు US డాలర్లను కొనుగోలు చేయాలి. రూపాయి క్షీణత కారణంగా.. వస్తువుల దిగుమతి మరింత ఖరీదైనదిగా మారుతుంది. క్రూడ్ ఆయిల్, మొబైల్ ఫోన్లు, కార్లు, ఉపకరణాలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, ముడిపదార్థాలు ఖరీదైనవిగా మారతాయి. ఇవి అంతిమంగా సామాన్యులను ప్రభావితం చేస్తాయి.
2. విదేశీ విద్య: US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను కోల్పోవటం వల్ల విదేశీ విద్య మరింత ఖరీదైనదిగా మారింది. విదేశీ సంస్థలకు, యూనివర్సిటీలకు ఫీజులు డాలర్ల రూపంలో చెల్లించటానికి ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపుతో విద్యా రుణాలు కూడా ఖరీదైనవిగా మారాయి.
3. విదేశీ ప్రయాణం: కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో అనేక మంది విదేశీ ప్రయాణాలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు డాలర్ బలోపేతం వీరి ఖర్చులను పెంచుతూ బడ్జెట్ పెంచుతున్నాయి.

RBI చర్యలు..
ఆర్‌బీఐ క్రమం తప్పకుండా విదేశీ మారకపు మార్కెట్‌ను పర్యవేక్షిస్తోంది. నాన్-రెసిడెంట్‌లకు భారతీయ రూపాయలను కలిగి ఉండే ఆకర్షణను పెంచుతుంది. విదేశీ మారక ద్రవ్య ప్రవాహాన్ని పెంచడానికి అనేక చర్యలను ప్రకటించినందున ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడులకు నిబంధనలను సరళతరం చేసింది. డెట్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులకు నిబంధనలను సడలించింది. భారత్ వద్ద ఫారెక్స్ నిల్వలు 15 నెలల కనిష్ఠానికి చేరుకోగా.. ప్రస్తుతం ఉన్న మారక నిల్వలు 10 నెలల కంటే తక్కువ దిగుమతులను కవర్ చేస్తాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications