ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకం క్రితం సెషన్‌లో 44 పైసలు నష్టపోయి 76.32 వద్ద ముగిసింది. గత ఏడాది ఏప్రిల్ నెల 24వ తేదీ తర్వాత డాలర్ ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. FIIల అమ్మకాలు భారీగా పెరగడం, ఫెడ్ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు రిస్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే డాలర్ మారకంతో రూపాయి మారకం రేటు 76.60కి పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు భావించారు.

అందుకే రూపాయి క్షీణత
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిక చేయడంతో ఈక్విటీ వంటి రిస్క్ సాధనాల నుండి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయిపై ప్రభావం పడింది.
ద్రవ్యోల్భణం రికార్డ్ స్థాయికి చేరింది. దీంతో అమెరికా ఫెడ్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇది కూడా రూపాయి పతనానికి కారణమైంది. ఫెడ్ రేట్ల పెంపు భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి స్టాక్ మార్కెట్లో జోరుగా అమ్మకాలు జరిపి, డాలర్లను వారి దేశాలకు తీసుకు వెళ్తున్నారు. దీంతో గత పదకొండు ట్రేడింగ్ రోజుల్లో రూపాయి వ్యాల్యూ ఏకంగా 119 పైసలు పడిపోయింది.

డాలర్ వర్సెస్ రూపాయి ఆయా సంవత్సరాల్లో..
1947 3.30
1949 4.76
1966 7.50
1975 8.39
1980 7.86
1985 12.38
1990 17.01
1995 32.427
2000 43.50
2005 (Jan) 43.47
2006 (Jan) 45.19
2007 (Jan) 39.42
2008 (Oct) 48.88
2009 (Oct) 46.37
2010 (22 Jan) 46.21
2011 (April) 44.17
2011 (21 Sep) 48.24
2011 (17 Nov) 55.3950
2012 (22 June) 57.15
2013 (15 May) 54.73
2013 (12 Sep) 62.92
2014 (15 May) 59.44
2014 (12 Sep) 60.95
2015 (15 Apr) 62.30
2015 (15 May) 64.22
2015 (19 sep) 65.87
2015(30 nov) 66.79
2016(20 Jan) 68.01
2016(25 Jan) 67.63
2016(25 Feb) 68.82
2016 (14 Apr) 66.56
2016 (22 Sep) 67.02
2016 (24 Nov) 67.63
2017 (28 Mar) 65.04
2017 (28 Apr) 64.27
2017 (15 May) 64.05
2017 (14 Aug) 64.13
2017 (24 Oct) 64.94
2018 (9 May) 64.80
2018 (Oct) 74.00
2019 (Oct) 70.85
2020 (Jan) 70.96
2020 (Dec) 73.78
డాలర్ మారకంతో రూపాయి ప్రస్తుతం 76.36 వద్ద ఉంది.

76 మార్కు క్రాస్
ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్రితం సెషన్‌లో 76ను క్రాస్ చేసింది. ఏప్రిల్ 24, 2020 నుండి రూపాయి (76 క్రాస్ చేయడం) ఈ స్థాయికి చేరడం గమనార్హం. రూపాయి గత పదకొండు ట్రేడింగ్ సెషన్లలో 9 ట్రేడింగ్ సెషన్లలో నష్టపోయింది. డాలర్ మారకంతో 119 పైసలు (1.58 శాతం) క్షీణించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications