For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్ మారకంతో మళ్లీ బలపడిన రూపాయి

|

డాలర్ మారకంతో రూపాయి ఈరోజు (సెప్టెంబర్ 9, బుధవారం) 5 పైసలు బలపడి రూ.73.55 వద్ద ముగిసింది. రూపాయి 73.67 వద్ద ప్రారంభమై, చివరకు 73.55 వద్ద ముగిసింది. 73.47 నుండి 73.73 మధ్య ట్రేడ్ అయింది. మంగళవారం రూపాయి 25 పైసలు బలహీనపడి 73.60 వద్ద ముగిసింది. డాలర్ వ్యాల్యూతో ఇది వారం కనిష్టం.

మరోవైపు, సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్రమంగా బలపడుతోంది. నిన్న 0.10 శాతం ఎగిసి 93.54 పలికింది. గత వారం వరకు డాలర్ వ్యాల్యూ క్రమంగా క్షీణించింది. ఈ వారం మెల్లిగా కోలుకుంటోంది. క్రూడాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 1.28 శాతం ఎగిసి 40.29 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రూడాయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్ నేడు రూ.2758 పెరిగింది.

అదిరిపోయే ఆఫర్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇది భలే ఛాన్స్.. ఎందుకంటే?అదిరిపోయే ఆఫర్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇది భలే ఛాన్స్.. ఎందుకంటే?

Rupee settles 5 paise higher at 73.55 against US dollar

మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఉదయం సెన్సెక్స్ 148 పాయింట్ల నష్టం, నిఫ్టీ 45పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా, అంతకుమించిన నష్టంతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 171 పాయింట్లు(0.45 శాతం) క్షీణించి 38,193.92 పాయింట్ల వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు (0.35 శాతం) నష్టపోయి 11,278 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ దశలో 400 పాయింట్ల మేర కూడా నష్టపోయింది. ఆ తర్వాత అంతరం తగ్గి 171 పాయింట్ల నష్టంతో ముగిసింది.

English summary

డాలర్ మారకంతో మళ్లీ బలపడిన రూపాయి | Rupee settles 5 paise higher at 73.55 against US dollar

At the interbank forex market, the domestic unit opened at 73.67 against the US dollar, and finally ended the day at 73.55, registering a rise of 5 paise over its last close.
Story first published: Wednesday, September 9, 2020, 17:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X