For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 నెలల గరిష్టానికి రూపాయి: డాలర్ Vs రూపాయి.. ఫిచ్ తాజా అంచనా ఇదీ

|

ముంబై: గతవారం ఒడిదుడుకులకు లోనైన దేశీయ కరెన్సీ ఈ వారం జోరుగా ప్రారంభమైంది. ఇంటర్ బ్యాంకు మార్కెట్లో 19 పైసలు పుంజుకొని డాలర్ మారకంతో 72.93 వద్ద ప్రారంభమైంది. చివరకు 10 పైసలు ఎగిసి 73.02 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ మార్కెట్లో కొనుగోళ్లు వెల్లువెత్తడం కలిసి వచ్చింది. శుక్రవారం 73.12 వద్ద క్లోజ్ అయింది. నేటి సెషన్లో 72.90-73.03 మధ్య ట్రేడ్ అయింది. ఇటీవల సిక్స్ బాస్కెట్ కరెన్సీలతో డాలర్ 32 నెలల కనిష్టం 90 దిగువకు చేరుకుంది. అంతకుముందు 2018లో డాలర్ ఇండెక్స్ ఈ స్థాయిలో కదలాడింది. అంటే దాదాపు మూడేళ్ల కనిష్టానికి చేరుకుంది.

ఐటీ రిటర్న్స్ ఆలస్యం చేస్తే జరిమానా, గడువులోగా ఫైల్ చేస్తే ప్రయోజనాలెన్నోఐటీ రిటర్న్స్ ఆలస్యం చేస్తే జరిమానా, గడువులోగా ఫైల్ చేస్తే ప్రయోజనాలెన్నో

4 నెలల గరిష్టానికి

4 నెలల గరిష్టానికి

ఓ వైపు డాలర్ బలహీనపడటం, మరోవైపు ఈక్విటీల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. కొనుగోళ్లు నమోదు చేశాయి. దీంతో డాలర్ మారకంతో రూపాయి 4 నెలల గరిష్టాన్ని తాకింది. నేడు సెన్సెక్స్ 48,000 మార్క్ దాటగా, నిఫ్టీ 14,100 పాయింట్లను క్రాస్ చేసి కొత్త శిఖరాలను తాకింది. రూపాయి కూడా బలపడింది. సమీప భవిష్యత్తులో రూపాయి మరికొంత సానుకూలంగా సాగవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రూపాయి పాజిటివ్‌గా.. ఇవి కూడా కారణమే

రూపాయి పాజిటివ్‌గా.. ఇవి కూడా కారణమే

ప్రధానంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) కోవిషీల్డ్ వ్యాక్సీన్‌కు పచ్చజెండా ఊపడం కలిసి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆశ్ట్రా జెనికా డెవలప్ చేసిన ఈ వ్యాక్సీన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. అలాగే భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్‌కు కూడా అనుమతిచ్చింది. అందుకే రూపాయి సానుకూలంగా కదిలిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే, జీఎస్టీ కలెక్షన్లు రికార్డుస్థాయిలో నమోదయ్యాయని, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

రూపాయి వ్యాల్యూని సవరించిన ఫిచ్

రూపాయి వ్యాల్యూని సవరించిన ఫిచ్

డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూని ఫిచ్ సొల్యూషన్స్ సవరించింది. 2021లో డాలర్ వ్యాల్యూతో రూపాయి 77కు చేరుకుంటుందని గతంలో అంచనా వేసింది. అయితే తాజాగా దీనిని 75.50తో సానుకూలంగా కుదించింది. అలాగే, 2022లో 79కు చేరుకోవచ్చునని అంచనా వేసిన ఫిచ్ సొల్యూషన్స్ 77కి సవరించింది.

English summary

4 నెలల గరిష్టానికి రూపాయి: డాలర్ Vs రూపాయి.. ఫిచ్ తాజా అంచనా ఇదీ | Rupee rises to highest level in 4 months against US dollar

Fitch Solutions on Monday said it has revised its forecast for the Indian rupee to average stronger at Rs 75.50 to a US dollar in 2021, from Rs 77/USD.
Story first published: Monday, January 4, 2021, 18:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X