రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర పరిమాణామాలు భారత కరెన్సీ రూపాయి పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నేడు డాలర్ మారకంతో రూపాయి దారుణంగా క్షీణించింది. 2022 క్యాలెండర్ ఏడాదిలోనే 3.5 శాతం క్షీణించింది. అమెరికా డాలర్ మారకంతో రూపాయి నేడు ఓ సమయంలో 77.02 వద్ద ట్రేడ్ అయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడుతోంది. అలాగే, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. మరోవైపు, రష్యా రూబుల్ సహా వివిధ దేశాల కరెన్సీలు డాలర్ మారకంతో పతనమవుతున్నాయి.
నేడు (సోమవారం, మార్చి 7) డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 76.94 వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో 77ను కూడా దాటింది. ఈ రోజు దాదాపు 1 శాతం మేర నష్టపోయిన రూపాయి డాలర్ మారకంతో పోలిస్తే 77.02 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆల్ టైమ్ కనిష్టం 76.90. ఈ రోజు దీనిని కూడా అధిగమించింది.

చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దిగుమతుల బిల్లు గణనీయంగా పెరగనుంది. దీంతో విదేశీ మారకపు నిల్వలు తగ్గుతున్నాయి. ఇది రూపాయి వ్యాల్యూపై ప్రభావం చూపుతోంది. దీంతో ఆసియాలోనే అత్యంత అద్వాన్న పని తీరును కనబరుస్తున్న కరెన్సీగా రూపాయి ఉంది.
రూపాయి వ్యాల్యూ పడిపోతే దిగుమతి వ్యయాలు పెరిగి, ఇది భారంగా మారుతుంది. మన దిగుమతుల్లో చమురు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరిగి, అన్ని రంగాలు, అన్ని ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. ఆహార ధరల పైన కూడా ప్రభావం ఉంటుంది. విదేశీ చదువులు, ప్రయాణాలు పెరుగుతాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications