For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు నెలల కనిష్టానికి పడిపోయిన రూపాయి

|

ముంబై: డాలర్ మారకంతో రూపాయి క్షీణించింది. ప్రపంచంతో పాటు దేశంలో ఆర్థిక మందగమన ప్రభావం, స్థూల ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉండటం, అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం, హాంగ్‌కాంగ్ అనిశ్చితి వంటి వివిధ కారణాల వల్ల రూపాయి విలువ బుధవారం రెండు నెలల కనిష్టానికి పడిపోయింది. బుధవారం ఒక్క రోజు 62 పైసలు పడిపోయి 72.09 వద్దకు చేరుకుంది. తద్వారా ఒకేసారి భారీ నష్టాన్ని నమోదు చేసింది.

గత నెల కంటే రూ.2,000 తగ్గిన బంగారం, కానీ రూపాయి దెబ్బతీస్తుందా?గత నెల కంటే రూ.2,000 తగ్గిన బంగారం, కానీ రూపాయి దెబ్బతీస్తుందా?

బుధవారం ఇంటర్ బ్యాంక్‌ ఫారెన్ ఎక్స్చేంజీలో డాలర్‌ మారకంతో 71.75 వద్ద బలహీనంగా రూపాయి ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72.10కి పడిపోయింది. చివరకు 62 పైసల నష్టంతో 72.09 వద్ద క్లోజ్ అయింది. సెప్టెంబర్ 4వ తేదీ తర్వాత రూపాయి మొదటిసారి భారీగా క్షీణించింది.

Rupee hits two month low, hits 72 per dollar

రూపాయి విలువ వరుసగా మూడో రోజు పతనమైందని, సెప్టెంబర్ 16 తర్వాత ఇంట్రాడేలో ఎక్కువ నష్టపోయిందని, పారిశ్రామికోత్పత్తి క్షీణించడం రూపాయిని ప్రభావితం చేస్తోందని HDFC సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ, క్యాపిటల్‌ మార్కెట్స్) శర్మ చెప్పారు. ప్రపంచ మార్కెట్లో డాలర్‌ బలపడటం కూడా రూపాయి నష్టపోవడానికి కారణమని చెబుతున్నారు.

English summary

రెండు నెలల కనిష్టానికి పడిపోయిన రూపాయి | Rupee hits two month low, hits 72 per dollar

The Indian rupee has extended the losses and trading at day's low level at 72.02 per dollar, with domestic equity market ended lower with Nifty below 11,850 level.
Story first published: Thursday, November 14, 2019, 9:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X