కరోనా వైరస్, క్రూడాయిల్ ప్రైస్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి బలహీనపడుతోంది. గురువారం డాలర్ మారకంతో 70 పైసలకు పైగా క్షీణించి రూ.74.96 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు ఉదయం రూ.74.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం ముగింపు రూ.74.26గా ఉంది. అంటే గురువారం దాదాపు రూ.75ను టచ్ అయింది.
ఫారన్ పోర్ట్‌పోలియేఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్ల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. కరోనా భయాలతో FPIలు వెనక్కి వెళ్ళడం రూపాయి బలహీనానికి ముఖ్య కారణాల్లో ఒకటి. మార్చి నెలలో ఇప్పటి వరకు రూ.70,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఓవర్సీస్ ఇన్వెసట్టర్లు ఈక్విటీల నుండి రూ.36,200 కోట్లు, డెట్ సెగ్మెంట్ నుండి రూ.32,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు.

మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఐటీ ఇండెక్స్ 27 నెలల కనిష్టానికి చేరుకుంది. మరోవైపు, గురువారం చమురు ధరలు కూడా 20 శాతం లాభపడ్డాయి. ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత మధ్యాహ్నానికి కాస్త కుదురుకున్నాయి. సెన్సెక్స్ 1700 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 700 పాయింట్లు కుదురుకొని 1000 పాయింట్ల నష్టం వద్ద కొనసాగింది. కరోనా, అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications