భారత కరెన్సీ రూపాయి బలపడింది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికన్ కరెన్సీతో రూపాయి 71 పైసలు పెరిగి 80.69కి చేరుకుంది. డాలర్ ఇండెక్స్ పతనంతో పాటు US CPI తగ్గడంతో రూపాయి బలపడింది. సానుకూల దేశీయ ఈక్విటీలు, ముడి చమురు ధరలలో క్షీణత వంటి అంశాలు కూడా రూపాయికి మద్దతు ఇచ్చాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకం వద్ద, దేశీయ రూపాయి డాలర్‌తో పోలిస్తే 80.76 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 80.69కి చేరుకుంది.
1947లో రూ.3.30
గురువారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 81.40 వద్ద ముగిసింది. 1947లో డాలర్‌తో రూపాయి మారకపు విలువ మూడు రూపాయల 30 పైసలుగా ఉండేది. ఆ తర్వాత రూపాయి విలువ పడిపోతూ రూ.80.69కి చేరుకుంది.
శుక్రవారం రూపాయి బలపడడం, చమురు ధరల్లో తగ్గుదల కారణంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 1021.78 పాయింట్లు లేదా 1.69 శాతం పెరిగి 61,635.48 వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 282.70 పాయింట్లు లేదా 1.57 శాతం పెరిగి 18,310.90 వద్దకు చేరుకుంది.

ఐటీ స్టాక్స్
ఐటీ స్టాక్ ల్లో పెరుగుదల నమోదు అయింది. ఇన్ఫోసిస్ 3.85 శాతం, టీసీఎస్ 3.49, హెచ్ సీఎల్ టెక్ 9.09, విప్రో 2.55 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‍డీఎఫ్సీ బ్యాంక్ 5.32 శాతం పెరగ్గా.. హెచ్‍డీఎఫ్సీ 5.31 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications