ముంబై: భారత స్టాక్ మార్కెట్లు నిన్న (ఏప్రిల్ 15) లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిశాయి. కరోనా కారణంగా ఏ మేరకు ఆర్థిక పతనం ఉంటుందోననే ఆందోళన మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. అలాగే డాలర్ మారకంతో రూపాయి కూడా మార్కెట్‌కు భయానికి గురి చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుడుదిగుడులు, రూపాయి మారకం విలువ జీవనకాల గరిష్టానికి చేరడం ఆందోళన కలిగించాయి.

రూపాయి అందుకే పడిపోయింది
అమెరికా డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రోజురోజుకూ పడిపోతోంది. బుధవారం చారిత్రక కనిష్టానికి చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. అలాగే, దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఇవన్నీ కలిసి కరెన్సీ నష్టోపవాల్సి వచ్చింది. నిన్న ప్రారంభంలో లాభపడిన దేశీయ కరెన్సీ విలువ చివరకు డాలర్ మారకంతో 17 పైసలు క్షీణించి 76.44కి పడిపోయింది.

బలపడి.. చివరకు బలహీనం
కరోనా కారణంగా ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలనున్నాయని రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ఇవి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో 76.07 వద్ద ప్రారంభమైన మారకం విలువ ఒక దశలో 75.95కు బలపడింది. చివరకు 17 పైసలు పతనమై 76.44 వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో రూపాయి 76.28 వద్ద ముగిసింది.

లాక్ డౌన్ పొడిగింపు సహా..
కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫారెక్స్ మార్కెట్ పైన ప్రతికూల ప్రభావం చూపిందని అంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 3.72 శాతం తగ్గి 28.50 డాలర్లకు పడిపోయింది.

బలపడుతున్న డాలర్
మరోవైపు, మిగతా దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ బలపడింది. 0.3 శాతం ఎగిసి 99.19కు పెరిగింది. ప్రస్తుతం డాలర్ - రూపాయి కన్సాలిడేషన్ ఫేజ్‌లో కనిపిస్తోందని, 76.80 వద్ద అడ్డంకి అని, 75.90 వద్ద బలమైన మద్దతు లభిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications