భారత కరెన్సీ రూపాయి సోమవారం (సెప్టెంబర్ 20) 34 పైసలు క్షీణించి 73.82 వద్ద ట్రేడ్ అయింది. ఓవర్సీస్ మార్కెట్‌లో డాలర్ ఇటీవల రోజు రోజుకు బలపడుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.82 వద్ద ప్రారంభమైంది. అయితే నేడు ప్రారంభంలోనే అంతకుముందు క్లోజింగ్‌తో 34 పైసలు క్షీణించింది. శుక్రవారం రూపాయి వ్యాల్యూ డాలర్ మారకంతో 73.48 వద్ద క్లోజ్ అయింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ నేడు 0.16 శాతం ఎగబాకి 93.34 వద్ద క్లోజ్ అయింది.
ఇదిలా ఉండగా, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గతవారాన్ని నష్టాలతో ముగించాయి. ఆసియా మార్కెట్లు ఈ రోజు ప్రతికూలంగా కదిలాయి. గత నాలుగు వారాలుగా రికార్డ్ స్థాయుల్లో దూసుకెళ్లిన సూచీలు స్థిరీకరణ దిశగా కనిపించింది. ఈ నేపథ్యంలో కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 137 పాయింట్లు నష్టపోయి 58,878 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 17,529 వద్ద ట్రేడ్ అయింది. చివరకు మార్కెట్లో భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 525 పాయింట్లు నష్టపోయి 58,490 పాయింట్ల వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు క్షీణించి 17,396 పాయింట్ల వద్ద ముగిసింది.

స్టాక్ మార్కెట్లు గతవారం స్వల్పలాభాల్లో ముగిశాయి. చివరి సెషన్‌లో సూచీలు నష్టపోయినప్పటికీ సెన్సెక్స్ 59,000 పాయింట్లను నిలబెట్టుకుంది. కానీ నేడు మాత్రం ఈ మార్కు దిగువకు పడిపోయింది. ఈ వారం స్టాక్ మార్కెట్‌తో పాటు బిలియన్ మార్కెట్ పైన వివిధ అంశాలు ప్రభావం చూపుతాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రికవరీ వేగంగా ఉండటం, కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వేగవంతం, ఫెడ్ నిర్ణయాలు సహా పలు అంశాలు స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల నేపథ్యంలో ఈ వారం ప్రాఫిట్ బుకింగ్ కనిపించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు ముందే అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నేడు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications