మంగళవారం ముగింపు 89.96తో పోలిస్తే.. ఈరోజు భారత రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే 90.16కి పడిపోయింది. రూపాయి తొలిసారిగా 90 స్థాయిని దాటడం మార్కెట్‌లో ఆందోళన కలిగించడమే కాకుండా.. రాబోయే నెలల్లో ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనే సంకేతాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ పతనం భారత కరెన్సీపై కొత్త ఒత్తిడిని సూచిస్తుండగా.. దిగుమతి ఖర్చులు, ఇంధన ధరలు, విదేశీ విద్య, ప్రయాణాల వంటి అనేక రంగాల్లో ప్రభావం తక్షణమే కనిపించనుంది.
ఈ సంవత్సరం భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే దాదాపు ఐదు శాతం క్షీణించింది. ఆసియాలో అత్యంత దారుణంగా మారిన కరెన్సీలలో ఒకటిగా రూపాయి నిలవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే.. రికార్డు స్థాయికి పెరిగిన వాణిజ్య లోటు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ, అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం ముగియడంలో జాప్యంతో పాటుగా బలమైన అమెరికా డాలర్. భారత విదేశీ వాణిజ్యంలో దిగుమతులు, ముఖ్యంగా బంగారం, వెండి, భారీగా పెరుగుతుండగా, ఎగుమతి పనితీరు తగ్గుముఖం పట్టడం వలన వాణిజ్య లోటు 41.68 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ఈ లోటును సమకూర్చడానికి మరిన్ని డాలర్లు అవసరం కావడం Rupee విలువపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.

విదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాది ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్ల నుండి దాదాపు 17 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకోవడంతో కరెన్సీపై అదనపు భారం పడింది. రూపాయి పడిపోతుందనే అంచనాల కారణంగా ఎగుమతిదారులు తమ డాలర్ ఆదాయాలను అమ్మడానికి ఉత్సాహం చూపకపోవడం, మరోవైపు దిగుమతిదారులు అత్యవసరంగా డాలర్లను కొనుగోలు చేయడం కూడా డాలర్ డిమాండ్‌ను పెంచి రూపాయిని మరింత బలహీనపర్చింది. మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నట్టుగా.. డాలర్ ప్రవాహాలు ప్రస్తుతం చాలా మందగించిన దశలో ఉన్నాయని, ఇది కరెన్సీ స్థిరత్వాన్ని కష్టతరం చేస్తోందని చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో రూపాయి విలువ ఇంకా పడిపోతుందా అనే ప్రశ్నపై ఆర్థిక వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్వల్పకాలంలో అయితే రూపాయి పతనం కొనసాగవచ్చు. వాణిజ్య లోటు విస్తరణ, విదేశీ పెట్టుబడి అవుట్‌ఫ్లోలు అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి రూపాయి పతన దిశను నిర్ణయించే కీలక అంశాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ స్థిరీకరణ కోసం చురుకుగా జోక్యం చేసుకుంటున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా బలపడుతున్న డాలర్ ప్రభావంతో RBI చర్యల ఫలితం పరిమితమే అయ్యే ప్రమాదం ఉంది.
బార్క్లేస్ విశ్లేషణ ప్రకారం.. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం విజయవంతంగా ముగియడం మాత్రమే రూపాయికి అర్థవంతమైన ఉపశమనాన్ని అందించగలది. మానసికంగా అత్యంత కీలకమైన 90 స్థాయి ఇప్పుడు ఉల్లంఘించబడినందున, రూపాయి రాబోయే రోజుల్లో 90.30 వరకు మరింత దిగజారే అవకాశం ఉందని HDFC సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. ఈ పరిణామాలు ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంధన ధరలు, దిగుమతి ఉత్పత్తుల ధరలు, విదేశీ రుణాలు, EMIs, విదేశీ విద్య ఖర్చులు అన్ని పెరిగే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో రూపాయి భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications