Rulka Electricals IPO: ఈ సారి ఎన్నికలను సైతం లెక్కచేయకుండా ఐపీవోలు తమ జోరును దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న కంపెనీ ఐపీవోపై ఇన్వెస్టర్లు మనసు పారేసుకుంటున్నారు. షేర్ల కొనుగోలుకు క్యూ దరఖాస్తులతో క్యూ కడుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రుల్కా ఎలక్ట్రికల్స్ ఐపీవో గురించే. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మే 16న ప్రారంభమైన ఐపీవో మే 21 వరకు పెట్టుబడిదారులకు పందెం వేసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే రెండు రోజుల పాటు ఇష్యూ సమయంలో 13.76 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాంక్ ధరను రూ.223 నుంచి రూ.235గా నిర్ణయించింది.

మే 17 నాటికి గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లకు రూ.240 ప్రీమియం ధర పలుకుతోంది. ఈ లెక్కన ఐపీవో లిస్టింగ్ రోజు వరకు ఇదే ధర కొనసాగితే షేర్లు మార్కెట్లో ఒక్కోటి రూ.475 రేటు వద్ద జాబితా అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే లిస్టింగ్ రోజున ఒక్కో షేరుకు 102.13% లిస్టింగ్ లాభం ఉంటుందని అంచనా. రుల్కా ఎలక్ట్రికల్స్ ఐపీవో NSE SME కేటగిరీలో మే 24, 2024న జాబితా చేయబడనుందని సమాచారం.
కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును రూ.235 చొప్పున మెుత్తంగా 3.19 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించటం ద్వారా రూ.7.5 కోట్లను సమీకరించింది. బోఫా సెక్యూరిటీస్ యూరోప్ ఎస్‌ఏ - ఓడిఐ, నెగెన్ అన్‌డిస్కవర్డ్ వాల్యూ ఫండ్, గెలాక్సీ నోబుల్ గ్లోబల్ ఆపర్చునిటీస్ వంటి మార్క్యూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 600 షేర్లుగా నిర్ణయించింది. ప్రస్తుత ఐపీవోలో కంపెనీ 8.42 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉండగా.. బుక్-బిల్డింగ్ ప్రక్రియ ద్వారా 2.8 లక్షల ఈక్విటీ షేర్ల విక్రయానికి ఆఫర్ ఉంది.
హెచ్‌ఎన్‌ఐలకు 1.6 లక్షలు, క్యూఐబీలకు 2.13 లక్షలు, రిటైల్ ఇన్వెస్టర్లకు 3.73 లక్షలతో సహా వివిధ వర్గాలకు ఐపీవోలో షేర్లను కేటాయించింది. బీలైన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకైక బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తుండగా.. బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణకు రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తుంది.


Click it and Unblock the Notifications