Rules Chnaging August 1st: రేపటి నుంచి మారే నిబంధనలివే.. మధ్యతరగతిపై భారం..
August 1st Changes: ప్రతినెల మాదిరిగానే జూలై నేటితో ముగియనున్నందున రేపటి నుంచి కొన్ని అంశాలకు సంబంధింంచిన రూల్స్ మారనున్నాయి. ఈ క్రమంలో వచ్చే మార్పులు ఆర్థికంగా సామాన్యుల జేబులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిస్తాయో ప్రస్తుతం అందరూ తప్పక గమనించాల్సి ఉంటుంది. ఇందులో గ్యాస్ సిలిండర్ ధరల నుంచి క్రెడిట్ కార్డుల వరకు అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి.
ఎల్‌పీజీ గ్యాస్ ధర:
దేశంలోని చమురు కంపెనీలు ప్రతి నెల మెుదటి తారీఖున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు ప్రకటిస్తుంటాయి. జూలై నెలలో కమర్షియల్ సిలిండర్ల ధరను కంపెనీలు తగ్గించాయి. దీంతో ఈ నెలలో కూడా డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల ధరలు మరోసారి తగ్గుతాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

క్రెడిట్ కార్డ్ నియమాల మార్పు:
దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం HDFC ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చేలా క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు ప్రకటించింది. వీటి ప్రకారం కార్డ్ హోల్డర్‌లకు థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా చేసే అన్ని అద్దె లావాదేవీలపై మొత్తంలో 1% ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లావాదేవీలకు గరిష్ఠ పరిమితిని రూ.3000గా బ్యాంక్ ఉంచింది. అలాగే పేటీఎం, క్రెడ్, మెుబిక్విక్ వంటి థర్డ్-పార్టీ చెల్లింపు యాప్‌లను ఉపయోగించి అద్దె లావాదేవీలు చేయవచ్చు. ఇక యుటిలిటీ చెల్లింపులపై రూ.50,000 కంటే తక్కువ జరిపితే అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేయగా, పరిమితికి మించిన ట్రాన్సాక్షన్లపై 1 శాతం ఛార్జీని వసూలు చేయనున్నట్లు పేర్కొంది. ఒక్కో లావాదేవీకి ₹3000 పరిమితి ఉంది. ఇక ఫ్యూయల్ చెల్లింపులు రూ.15,000 దాటితే 1 శాతం రుసుముగా చెల్లించుకోక తప్పదు.
గూగుల్ మ్యాప్స్ మార్పు:
అమెరికాకు చెందిన గూగుల్ మ్యాప్స్ ఆగస్టు 1 నుంచి ఇండియాలో అందిస్తున్న సేవల్లో ముఖ్యమైన మార్పులు చేస్తోంది. ఆగస్టు నుంచి ప్రముఖ టెక్ కంపెనీ తన సర్వీస్ ఛార్జీలను 70% తగ్గించింది. దీని ద్వారా ఎక్కువ మంది సర్వీస్ ప్రొవైడర్లు గూగుల్ మ్యాప్‌లను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. అలాగే వీటికి సంబంధించిన పేమెంట్స్ రూపాయల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. సాధారణ వినియోగదారులు మాత్రం ఎలాంటి కొత్త ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఫాస్టాగ్ కొత్త నిబంధనలు:
దేశవ్యాప్తంగా వాహనదారులకు ఫాస్టాగ్ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో ఫాస్టాగ్ KYCని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా మార్చేసింది. అనేక నియమాలు ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ ఫాస్టాగ్ పనిచేయటం కొనసాగాలంటే ఇకపై KYC పూర్తి చేయటం అవసరం. ఆగస్టు 1 నుంచి కంపెనీలు ఎన్‌పీసీఐ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలలో 3-5 ఏళ్ల పాత ఫాస్ట్‌ట్యాగ్‌ల కోసం KYCని అప్‌డేట్ చేయడం, అక్టోబర్ 31 నాటికి ఐదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఫాస్టాగ్‌లను భర్తీ చేయడం వంటివి ఉన్నాయి.
CNG-PNG రేట్లు:
దేశవ్యాప్తంగా నెల మొదటి రోజున LPG సిలిండర్ ధరలలో మార్పుతో పాటుగానే చమురు కంపెనీలో దేశంలోని వివిధ నగరాల్లో విక్రయించే CNG-PNG రేట్లను, విమాన ఇంధన ధరల మార్పులను ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రైవేటు గ్యాస్ సంస్థలు సైతం తమ రేట్లలో మార్పులు ప్రకటించవచ్చు.
ఐటీఆర్ దాఖలు:
ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి వాస్తవంగా చివరి రోజు 31 జూలై 2024. అయితే ఈ సమయంలోపు రిటర్న్ ఫైలింగ్ చేయటంలో మిస్ అయిన వ్యక్తులు పెనాల్టీతో పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. వారు సంవత్సరం చివరి వరకు అంటే 31 డిసెంబర్ 2024 వరకు ఆలస్యమైన రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications