Rudra Gas IPO: ఈవారం కూడా మార్కెట్లలో వరుసగా ఐపీవోగా హడావిడి కొనసాగుతోంది. దీంతో రిటైలర్లు ఇప్పటికే 95 శాతం ఐపీవోలు ఇచ్చిన లాభాలను చూసి పెట్టుబడులు పెట్టేందుకు చాలా కుతూహలంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఎస్ఎమ్ఈ కేటగిరీలో రుద్ర గ్యాస్ ఎంటర్‌ప్రైజ్ కంపెనీ తన ఐపీవోను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అందుకే చాలా మంది ఈ కంపెనీలో పెట్టుబడి అవకాశాన్ని గొప్పదిగా పరిగణిస్తున్నారు. రుద్ర గ్యాస్ ఎంటర్‌ప్రైజ్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం ఫిబ్రవరి 8, 2024న తెరవబడి ఫిబ్రవరి 12న ముగుస్తుంది. రుద్ర గ్యాస్ ఎంటర్‌ప్రైజ్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.63గా నిర్ణయించింది.

రుద్ర గ్యాస్ కంపెనీ తన ఐపీవో లాట్ పరిమాణాన్ని 2,000 షేర్లుగా నిర్ణయించింది. కంపెనీ ప్రాథమికంగా ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌లు, గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌లు, నిర్మాణ సామగ్రి & వాహనాలను అద్దెకు ఇచ్చే వ్యాపారంలో నిమగ్నమై ఉంది. మునిసిపల్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ పరిశ్రమకు కంపెనీ సమగ్ర పరిష్కారాలను అందిస్తుంది. ఈ సంస్థ సివిల్ వర్క్స్, పైప్‌లైన్ నిర్మాణం, పైప్‌లైన్ నెట్‌వర్క్ ఆపరేషన్, సిటీ గ్యాస్ పంపిణీ కోసం నిర్వహణలో ప్రత్యేకత కలిగి ఉంది.
కంపెనీ ప్రమోటర్లుగా మంజులాబెన్ సురేశ్‌భాయ్ పటేల్, కుష్ సురేశ్‌భాయ్ పటేల్, కశ్యప్ సురేశ్‌భాయ్ పటేల్ ఉన్నారు. రుద్ర గ్యాస్ ఎంటర్‌ప్రైజ్ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.14.16 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 22,48,000 ఈక్విటీ షేర్లను ఇష్యూలో విక్రయిస్తోంది. అయితే ఈ షేర్లు పూర్తిగా తాజా ఇష్యూ అని ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ ఉండబోదని కంపెనీ ప్రకటించింది. మంగళవారం నాడు గ్రేమార్కెట్ ప్రీమియం రూ.20గా కొనసాగుతోంది. ఐపీవో ఇష్యూ షురూ కాగానే జీఎంపీ మరింతగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications