పతంజలి గ్రూప్ కంపెనీల్లో అనూహ్య పరిణామం: ఆయుర్వేద పేరు కనిపించదిక
ముంబై: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఇవ్వాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ రిటైల్ ఫుడ్ బిజినెస్‌ను రుచి సోయా టేకోవర్ చేసుకోనుంది. దీనికి సంబంధించిన బిజినెస్ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్ ఈ రెండు కంపెనీల మధ్య కుదిరాయి. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ను రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ టేకోవర్ చేస్తుందని మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో- రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరు కూడా మార్చుకోనుంది.
ఇకపై ఇది పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌గా ఆవిర్భవించనుంది. ఈ బదలాయింపులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలతో కూడిన ప్రతిపాదనలను పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వాళ రెగ్యులేటరీకి సమర్పించింది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్‌కు చెందిన రుచి సోయాను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది. పతంజలి అనే బ్రాండ్ నేమ్ కింద ఇకపై రుచిసోయా గానీ, పతంజలి ఆయుర్వేద ఫుడ్స్ గానీ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.

పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ను రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొత్తం 690 కోట్ల రూపాయలను కొనుగోలు చేసినట్లు మేనేజ్‌మెంట్ తన ప్రతిపాదనల్లో పొందుపరిచింది. నెయ్యి, తేనె, ఇతర మసాలా దినుసులు, గోధుమలు, పండ్ల రసాలు, నూడుల్స్, రవ్వా ఇడ్లీ, జింజర్ పికిల్స్.. వంటి మొత్తం 21 రకాల పుడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇకపై పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ అనే పేరు మీద ఉంటాయని వివరించింది. రుచి సోయాను కూడా ఈ బ్రాండ్ పరిధిలోనికే చేర్చినట్లు పేర్కొంది.
పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ పరిధిలోని మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్, లేబ్లింగ్, ఇతర రిటైల్ ట్రైడింగ్ ప్రొడక్ట్స్.. అన్నీ రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు బదలాయింపు అయ్యాయి. అలాగే- బిహార్‌లోని పదర్థ, ఉత్తరాంచల్ హరిద్వార్, మహారాష్ట్రలోని నెవాసలో గల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇకపై కొత్తగా ఆవిర్భవించిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ పరిధిలోకి వస్తాయని ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీల యాజమాన్యం రెగ్యులేటరీకి తెలియజేసింది.


Click it and Unblock the Notifications