ఆధార్-పాన్ లింకింగ్‌లో నమ్మలేని నిజాలు.. వామ్మో, అన్నికోట్ల మంది కార్డులు బ్లాక్ అయ్యాయా..?
Aadhar-Pan linkage: దేశంలో పన్నుల వసూళ్లను పెంచేందుకు, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆధార్ తో పాన్ కార్డును లింక్ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. అలా చేయకపోతే పాన్ కార్డులను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది.
ఆధార్-పాన్ లింకింగ్ కు కొంత గడువు ఇచ్చిన కేంద్రం.. దానిని పలుమార్లు పెంచుతూ పోయింది. అయినప్పటికీ కొందరు అశ్రద్ధ చేశారు. దీంతో దాదాపు 11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) తెలిపింది. RTI చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. ఇటీవల భారీ మొత్తంలో ఫేక్ GST క్లెయిమ్స్ బయటపడిన నేపథ్యంలో.. ఈ 11.5 కోట్ల కార్డుల ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలో మొత్తం 70.24 కోట్ల మందికి పాన్ కార్డులు ఉన్నాయి. వారిలో 57.25 మంది తమ పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 30తో ఇందుకు చివరి గడువు ముగిసింది. కాగా మిగిలిన 12 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్‌తో లింక్ కాలేదు. దీంతో వాటిలో 11.5 కోట్ల కార్డులు డీయాక్టివేట్ చేయబడినట్లు CBDT స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ అనే వ్యక్తి RTI ద్వారా ఈ సమాచారం తెలుసుకునేందుకు దరఖాస్తు చేశారు. తద్వారా CBDT ఈ డేటాను బయటపెట్టింది. ఇప్పుడైతే కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడే ఆధార్ మరియు పాన్ కార్డ్‌ల లింక్ ఆటోమేటిక్‌గా జరుగిపోతోంది. జూలై 1, 2017కు ముందు కేటాయించిన పాన్ కార్డులకు మాత్రం మాన్యువల్ గా లింక్ చేయడం తప్పనిసరి.


Click it and Unblock the Notifications