Ambani News: బయటపడ్డ ముఖేష్ అంబానీ బండారం.. వేలకోట్లు ఎగ్గొట్టినట్లున్నాడుగా..!!
Mukesh Ambani: ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సోదరుడు అనిల్ అంబానీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోగా, ముఖేష్ మాత్రం అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నారు. ఎవరూ కనీవినీ ఎరుగని హంగు, ఆర్భాటాలతో కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిపిస్తున్నారు. వేలకోట్లను విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
దేశవిదేశాల నుంచి అతిరథ మహారథులను రప్పించి కుమారుడి పెళ్లి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ముఖేష్ అంబానీకి RTI కార్యకర్త అనిల్ గల్గాలీ గట్టి షాక్ ఇచ్చారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA)కి ఏకంగా 4 వేల 381 కోట్ల మేర బకాయిలు చెల్లించేదని బాంబ్ పేల్చారు. ఈ వ్యవహారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ డిఫాల్టర్‌గా మారిందని వెల్లడించారు.

వేల కోట్ల వ్యయంతో ప్రస్తుతం అనంత్ అంబానీ వివాహ వేడుక జరిగుతున్న జియో కన్వెన్షన్ సెంటర్ (ప్లాట్ నంబర్ C 64) లీజుకు సంబంధించి ఈ మొత్తం మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీతో పాటు నమన్ హోటల్, అంబానీ ఫౌండేషన్, INS, రఘులీలా బిల్డర్స్ వంటి ఇతరులు కూడా డిఫాల్టర్లుగా ఉన్నారని గల్గాలీ పేర్కొన్నారు. వారి మొత్తం బకాయిలు 5 వేల 818 కోట్లు కాగా.. రిలయన్స్ మాత్రం వీరిలో అతిపెద్ద డిఫాల్టర్‌గా కొనసాగుతోందన్నారు.
MMRDA నుంచి భూమిని లీజుకు తీసుకున్న 4 సంవత్సరాలలోపు నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే జరిమానా విధించబడుతుంది. ఇందుకు అనుగుణంగా అక్కడ లీజుదార్లైన CBI, ఆదాయపు పన్ను శాఖ వంటి ఇతర సంస్థలు నిజాయితీగా పెనాలిటీ చెల్లించారు. అయితే ఈ డిఫాల్టర్ల పట్ల MMRDA చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు గల్గాలీ ఆరోపిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవడానికి బదులుగా నమన్ హోటల్‌కు పాక్షిక OC మంజూరుపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. ఈ విషయమై CMకు లేఖ రాసినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications