కోవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధి కోసం రూ.900 కోట్లు: నిర్మల సీతారామన్ కీలక ప్రకటన
ఇండియన్ కొవిడ్ న్యాక్సీన్ పరిశోన-అభివృద్ధి కోసం డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు కరోనా వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. నేడు ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో భాగంగా వ్యాక్సీన్ అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మల తెలిపారు.
ప్రభుత్వ టెండర్లకు సంబంధించి పర్ఫార్మెన్స్ సెక్యూరిటీని 5 శాతం నుండి 10 శాతానికి బదులు 3 శాతానికి తగ్గించినట్లు నిర్మల తెలిపారు. వివాదం లేని ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుందన్నారు. ఈఎండీకి బదులు బిడ్ సెక్యూరిటీ డిక్లరేషన్ సరిపోతుందన్నారు. 31 డిసెంబర్ 2021 వరకు ఈ ప్రయోజనాలు కొనసాగస్తామని తెలిపారు. రూ.2 కోట్ల వ్యాల్యూ వరకు సర్కిల్ రేటు, అగ్రిమెంట్ వ్యాల్యూను 10 శాతానికి బదులు 20 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ఐటీ చట్టం ప్రకారం ఆస్తుల కొనుగోలుదారులకు 20 శాతం వరకు రిలీఫ్ ఇది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద రూ.18,000 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు నిర్మల. ఈ అదనపు నిధుల వల్ల మరో 12 లక్షల ఇళ్లు పూర్తవుతాయని, మొత్తం 18 లక్షల ఇళ్లు పూర్తవుతాయని తెలిపారు.
సబ్సిడైజ్డ్ ఫెర్టిలైజర్స్ కోసం రూ.65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పీఎం గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజనకు అదనంగా రూ.10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(NIIF) డెబిట్ ప్లాట్‌ఫాంలోకి రూ.6,000 కోట్ల ఈక్విటీని ఇన్‌ఫ్యూజ్ చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. NIIF స్వయంగా రూ.2000 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని తెలిపారు. క్యాపిటల్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పెండిచర్ కోసం అదనంగా రూ.10,200 కోటాయిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications